Telugu Global
CRIME

నాటు సారా అనుకుని రసాయనం తాగారు...

విశాఖ జిల్లా గాజువాకలో విషాదం చోటు చేసుకుంది. నాటుసారా అనుకుని రసాయనాన్ని తాగేశారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా… మరో 15 మంది ఆస్పత్రిలో చేరారు. పందుల పెంపకం చేసే మంగాయమ్మకు సమీపంలోని డంప్‌ యార్డ్ వద్ద నల్లటి క్యాన్‌ దొరికింది. దాన్ని తీసుకొచ్చి స్థానికులకు చూపించగా… అందులోని ద్రావణం నాటు సారా వాసన వస్తుండడంతో అది నాటు సారా అని డిసైడ్ అయిపోయారు. కాలనీలోని వారంతా తలా కొంచెం తాగేశారు. మంగాయమ్మ కూడా తాగింది. అలా తాగిన వెంటనే అందరూ అస్వస్థతకు గురయ్యారు. నలుగురు […]

నాటు సారా అనుకుని రసాయనం తాగారు...
X

విశాఖ జిల్లా గాజువాకలో విషాదం చోటు చేసుకుంది. నాటుసారా అనుకుని రసాయనాన్ని తాగేశారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా… మరో 15 మంది ఆస్పత్రిలో చేరారు.

పందుల పెంపకం చేసే మంగాయమ్మకు సమీపంలోని డంప్‌ యార్డ్ వద్ద నల్లటి క్యాన్‌ దొరికింది. దాన్ని తీసుకొచ్చి స్థానికులకు చూపించగా… అందులోని ద్రావణం నాటు సారా వాసన వస్తుండడంతో అది నాటు సారా అని డిసైడ్ అయిపోయారు. కాలనీలోని వారంతా తలా కొంచెం తాగేశారు.

మంగాయమ్మ కూడా తాగింది. అలా తాగిన వెంటనే అందరూ అస్వస్థతకు గురయ్యారు. నలుగురు చనిపోయారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్యాన్‌లో ఉన్న రసాయనం ఏమిటి అన్నది అధికారులు
కూడా చెప్పలేకపోతున్నారు. దాంతో దాన్ని ల్యాబ్‌కు పంపించారు.

First Published:  24 Feb 2019 8:40 PM GMT
Next Story