Telugu Global
Cinema & Entertainment

కోపంగా వెళ్ళిపోయిన మహేష్ బాబు

దాదాపు ఏడాది కాలం నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక ముఖ్యమైన సీన్ ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూట్ చేయడానికి మూవీ యూనిట్ రెడీ అయింది. అందుకు తగ్గ పర్మిషన్స్ కూడా దిల్ రాజు ఆల్రెడీ తీసుకున్నాడట. ఇక షూటింగ్ లొకేషన్ కి…. మేకప్ వేసుకొని మహేష్ […]

కోపంగా వెళ్ళిపోయిన మహేష్ బాబు
X

దాదాపు ఏడాది కాలం నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక ముఖ్యమైన సీన్ ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూట్ చేయడానికి మూవీ యూనిట్ రెడీ అయింది. అందుకు తగ్గ పర్మిషన్స్ కూడా దిల్ రాజు ఆల్రెడీ తీసుకున్నాడట.

ఇక షూటింగ్ లొకేషన్ కి…. మేకప్ వేసుకొని మహేష్ బాబు ఉదయం 7.30 కి చేరుకున్నాడట. అయితే అక్కడ మహేష్ ను ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమతించలేదని సమాచారం. ఢిల్లీలోని ఉన్నత అధికారుల అనుమతి వచ్చేదాకా “మహర్షి” షూటింగ్ ఆపమని కోరినట్లు తెలుస్తోంది. తమకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని ‘మహర్షి’ మూవీ యూనిట్ ఎంత చెప్పినా కూడా ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు.

దీంతో మహేష్ బాబు కొద్దిసేపు ఎయిర్ పోర్ట్ బయట ఉన్న వ్యాన్ లో కూర్చొన్నాడట. ఇక చివరకు మహేష్ బాబు…. “మహర్షి” టీం పై , దిల్ రాజు పై అసహనంతో తిరిగి వెళ్ళి పోయినట్లు చెబుతున్నారు.

First Published:  25 Feb 2019 12:39 AM GMT
Next Story