Telugu Global
NEWS

తండ్రి టీడీపీలో... కూతురు కాంగ్రెస్‌లో... ఇదేమి డ్రామా?

కాంగ్రెస్‌ సీనియర్ నేత‌ కిశోర్‌ చంద్రదేవ్ టీడీపీలో చేరారు. ప‌సుపు కండువా క‌ప్పుకున్నారు. ఇక్కడి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కేంద్ర‌మాజీ మంత్రిగా ప‌నిచేసిన కిషోర్ చంద్ర‌దేవ్ కూడా చంద్ర‌బాబుతో క‌లిసి ఆడుతున్న డ్రామాలు ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో కాంగ్రెస్‌ నాటకం న‌డుస్తుంద‌ని జిల్లా నేత‌లు మాట్లాడుకుంటున్నారు. కిశోర్‌ చంద్రదేవ్‌ టిడిపి కండువా కప్పుకున్నారు. కానీ ఆయ‌న కుమార్తె శ్రుతీదేవి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. తండ్రి పార్టీ మారినా….కూతురు కాంగ్రెస్‌లో ఎందుకు […]

తండ్రి టీడీపీలో... కూతురు కాంగ్రెస్‌లో... ఇదేమి డ్రామా?
X

కాంగ్రెస్‌ సీనియర్ నేత‌ కిశోర్‌ చంద్రదేవ్ టీడీపీలో చేరారు. ప‌సుపు కండువా క‌ప్పుకున్నారు. ఇక్కడి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కేంద్ర‌మాజీ మంత్రిగా ప‌నిచేసిన కిషోర్ చంద్ర‌దేవ్ కూడా చంద్ర‌బాబుతో క‌లిసి ఆడుతున్న డ్రామాలు ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో కాంగ్రెస్‌ నాటకం న‌డుస్తుంద‌ని జిల్లా నేత‌లు మాట్లాడుకుంటున్నారు.

కిశోర్‌ చంద్రదేవ్‌ టిడిపి కండువా కప్పుకున్నారు. కానీ ఆయ‌న కుమార్తె శ్రుతీదేవి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. తండ్రి పార్టీ మారినా….కూతురు కాంగ్రెస్‌లో ఎందుకు ఉన్నార‌నేది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే కిశోర్ టీడీపీ నుంచి పోటీ చేస్తే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు గంప‌గుత్త‌గా వైసీపీకి వెళ్లే అవ‌కాశం ఉంది. దీంతో కాంగ్రెస్ త‌ర‌పున కూతురిని బ‌రిలోకి దించాల‌ని ఎత్తుగ‌డ వేయిస్తున్న‌ట్లు తెలిసింది. దీంతో త‌మ వ్య‌తిరేక ఓటు వైసీపీకి వెళ్ల‌కుండా ఉంటుంద‌ని జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

అయితే తండ్రీకూతుళ్లు పోటీలో ఉంటే… ఈ విష‌యం అర‌కు ప్ర‌జ‌లు గ‌మ‌నించర‌ని చంద్ర‌బాబు అండ్ కో బ్యాచ్ అనుకుంటుంది. కానీ ఈ రాజ‌కీయాలు తెలిసిన అర‌కు ఓట‌ర్లు…ఈ ఇద్ద‌రికీ కాకుండా వేరే కొత్త వ్య‌క్తికి ఓటు వేసే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా.

మ‌రోవైపు కిశోర్ చేరిక మ‌రో టీడీపీ కీల‌క నేత పూసపాటి అశోక్‌ గజపతి రాజుకు తెలియకుండా జరిగిపోయింది. ఆయ‌న అల‌క‌వ‌హించ‌డంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా కిశోర్‌ను ఆశోక్‌ ఇంటికి పంపించారు. రాజుగారి కోపానికి అడ్డుకట్ట వేయించారు. కానీ అశోక్‌ అలక తీరలేదు. ఈ నేపథ్యంలో కిశోర్‌ చేరిక సమయంలో జిల్లా టిడిపి నాయకత్వంగానీ, గిరిజన నాయకత్వమెవరూ హాజరు కాలేదు. మొత్తానికి కిశోర్‌ చంద్రదేవ్‌ డ్రామా వెనుక ఎన్నికల వ్యూహాలు, చంద్రబాబు ఎత్తుగడలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

First Published:  25 Feb 2019 12:26 AM GMT
Next Story