ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల ప్రేమ గీతాన్ని వదిలిన వర్మ
ఎన్టీఆర్ బయోపిక్‌పై బాలకృష్ణ తీసిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో వర్మ మరింత ఉత్సాహంగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వెన్నుపోటు పాట, ట్రైలర్లతో దుమ్మురేపుతున్న వర్మ…. తాజాగా మరో పాటను వదిలారు. ఈసారి అనురాగ గీతాన్ని జనం పైకి వదిలాడు వర్మ. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య అన్యోన్యత, ఆప్యాయత, అనురాగం కలగలిపి ఈ పాటలో వర్మ వినిపించాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ పాటను పాడారు. ”నీ ఉనికే.. నా జీవితానికి అర్థం… నీ రాకయే […]

ఎన్టీఆర్ బయోపిక్‌పై బాలకృష్ణ తీసిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో వర్మ మరింత ఉత్సాహంగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వెన్నుపోటు పాట, ట్రైలర్లతో దుమ్మురేపుతున్న వర్మ…. తాజాగా మరో పాటను వదిలారు.
ఈసారి అనురాగ గీతాన్ని జనం పైకి వదిలాడు వర్మ. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య అన్యోన్యత, ఆప్యాయత, అనురాగం కలగలిపి ఈ పాటలో వర్మ వినిపించాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ పాటను పాడారు.
”నీ ఉనికే.. నా జీవితానికి అర్థం… నీ రాకయే నాకు స్వర్గతుల్యం” అంటూ లక్ష్మీపార్వతిపై ఎన్టీఆర్ కురిపించే ప్రేమానురాగాలను ఈ పాటలో వినిపించారు. ఈ పాట కూడా వదిలిన క్షణం నుంచే లక్షలమందికి చేరువైంది.
Here is the first song video of #LakshmisNTR Music @kalyanimalik31 Lyrics @sirasri and sung by the one and only S P B https://t.co/J3YbpLvEy2
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2019