Telugu Global
NEWS

బెయిల్ కావాలా..? అయితే లక్ష రూపాయలు విరాళం ఇవ్వండి : తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. శివశంకర్ రావు ఇవాళ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చారు. ఒక ఆర్థిక సంబంధమైన నేరంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఛీఫ్ జస్టీస్ రెండు షరతులు విధించారు. అవి పాటిస్తే తప్పక బెయిల్ మంజూరు చేస్తానని చెప్పారు. వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి 150 కోట్లకు పైగా నిధులు వసూలు చేసి వారిని మోసం చేశారని సన్ పరివార్ గ్రూప్ నిర్వాహకులపై […]

బెయిల్ కావాలా..? అయితే లక్ష రూపాయలు విరాళం ఇవ్వండి : తెలంగాణ హైకోర్టు
X

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. శివశంకర్ రావు ఇవాళ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చారు. ఒక ఆర్థిక సంబంధమైన నేరంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఛీఫ్ జస్టీస్ రెండు షరతులు విధించారు. అవి పాటిస్తే తప్పక బెయిల్ మంజూరు చేస్తానని చెప్పారు.

వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి 150 కోట్లకు పైగా నిధులు వసూలు చేసి వారిని మోసం చేశారని సన్ పరివార్ గ్రూప్ నిర్వాహకులపై కేసు నమోదైంది. అయితే వాళ్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కారణంతో ఇటీవల వారి బెయిల్ రద్దు చేశారు.

దీంతో హైకోర్టు మెట్లెక్కిన నిందితులు మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో నిందితులకు ప్రధాన న్యాయమూర్తి రెండు షరతులు విధించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల పేరిట లక్ష రూపాయల విరాళం అందించడంతో పాటు దర్యాప్తుకు సహకరించాలని షరతు విధించారు. లక్ష రూపాయలను సైనిక సంక్షేమ నిధికి బదిలీ చేయాలని జస్టీస్ సూచించారు. దీంతో షరతులకు ఒప్పుకోని బెయిల్ పొందారు.

ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా ఒక నిందితునికి 50 మొక్కలు ప్రభుత్వ పాఠశాలలో నాటాలని షరతుతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

First Published:  23 Feb 2019 10:04 AM GMT
Next Story