Telugu Global
NEWS

తెలుగుదేశంలో కర్నూలు రచ్చ ఇంతింత కాదు!

తెలుగుదేశం పార్టీలో కర్నూలు రచ్చ కొనసాగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నా… అభ్యర్థులను మాత్రం డిసైడ్ చేయలేకపోతూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే పార్టీలోకి కోట్ల చేరికకు మాత్రం లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్ ను బాబు ఖరారు చేసినట్టే. అక్కడ నుంచి సిట్టింగ్ ఉండి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకకు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కనట్టే. మరి ఆమెకు […]

తెలుగుదేశంలో కర్నూలు రచ్చ ఇంతింత కాదు!
X

తెలుగుదేశం పార్టీలో కర్నూలు రచ్చ కొనసాగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నా… అభ్యర్థులను మాత్రం డిసైడ్ చేయలేకపోతూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే పార్టీలోకి కోట్ల చేరికకు మాత్రం లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.

కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్ ను బాబు ఖరారు చేసినట్టే. అక్కడ నుంచి సిట్టింగ్ ఉండి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకకు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కనట్టే. మరి ఆమెకు చంద్రబాబు నాయుడు వేరే టికెట్ ఏదైనా ఇస్తారా లేకా పూర్తిగా పక్కన పెట్టేస్తారా.. అనేది త్వరలోనే తేలుతుంది.

ఇక కర్నూలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా పంచాయితీ కొనసాగుతూ ఉంది. ఆ టికెట్ విషయంలో టీజీ కుటుంబం, ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్యన పోరు కొనసాగుతూ ఉంది. ఒకవేళ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడికి దక్కకపోతే తాము పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అని టీజీ వెంకటేష్ అంటున్నారట.

ఇక పార్టీ టికెట్ దక్కకపోతే.. వీడటానికి ఏ మాత్రం మొహమాటపడేది లేదని అంటున్నాడట ఎస్వీ మోహన్ రెడ్డి కూడా. ఇలా ఇద్దరు నేతలూ ఎవరికి టికెట్ దక్కితే వారు మాత్రమే టీడీపీలో ఉంటామని అంటున్నారట.

ఇక నంద్యాల రచ్చ సరేసరి. అక్కడ కూడా చాలా మంది ఆశావహులున్నారు. తనకు నంద్యాల లేదా ఆళ్లగడ్డ ఏదో ఒక సీటు ఇవ్వాలని చంద్రబాబు నాయుడును ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఆ రెండు టికెట్లూ తమకే కావాలని భూమా అఖిలప్రియ అంటోంది. అందుకు సంబంధించి కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి.

ప్రస్తుతానికి అయితే కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఖాయమట. కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్, ఆయన భార్యకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ దక్కడం ఖాయమైందని సమాచారం.

First Published:  23 Feb 2019 12:18 AM GMT
Next Story