Telugu Global
NEWS

టీడీపీకి గట్టి ఝలక్ ఇచ్చిన రాహుల్ గాంధీ!

ఒకవైపు కాంగ్రెస్ పార్టీని అవసరం మేరకు వాడుకొంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో పొత్తు కోసం తనే ఆరాటపడ్డాడు చంద్రబాబు నాయుడు. అక్కడ సొంతంగా పోటీ చే్స్తే పరువు దక్కదు అని బాబు కాంగ్రెస్ తో పొత్తు కోసం వెళ్లాడు. తీరా అక్కడ కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేశాకా.. ఏపీలో మాత్రం పొత్తు లేదని అన్నాడు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల తనకు నష్టం అని చంద్రబాబు నాయుడు భావించాడు. అందుకే కాంగ్రెస్ తో […]

టీడీపీకి గట్టి ఝలక్ ఇచ్చిన రాహుల్ గాంధీ!
X

ఒకవైపు కాంగ్రెస్ పార్టీని అవసరం మేరకు వాడుకొంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో పొత్తు కోసం తనే ఆరాటపడ్డాడు చంద్రబాబు నాయుడు. అక్కడ సొంతంగా పోటీ చే్స్తే పరువు దక్కదు అని బాబు కాంగ్రెస్ తో పొత్తు కోసం వెళ్లాడు. తీరా అక్కడ కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేశాకా.. ఏపీలో మాత్రం పొత్తు లేదని అన్నాడు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల తనకు నష్టం అని చంద్రబాబు నాయుడు భావించాడు. అందుకే కాంగ్రెస్ తో పొత్తుకు నో అన్నాడు.

ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను చేర్చుకుంటూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలని అనుకుంటుంటే.. ఆ పార్టీకి అభ్యర్థులను కూడా మిగలనీయకుండా చంద్రబాబు నాయుడు గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య ఆసక్తిదాయకంగా ఉంది.

చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇస్తున్నట్టుగా ఉంది ఆ మాట. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము ప్రత్యేకహోదాను ఏపీకి ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించాడు. ఇది ఆసక్తిదాయకమైన అంశం.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి తను మిత్రపక్షం అని చంద్రబాబు నాయుడు ప్రకటించుకుంటున్నాడు. అయితే రాహుల్ ఆ మాట చెప్పడం లేదు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాలని రాహుల్ అనలేదు. అలాగని తెలుగుదేశం అధికారంలోకి రావాలనీ అనలేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఏపీకి తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించాడు.

ఇది ఆహ్వానించదగిన ప్రకటనే. ఢిల్లీలో రాహుల్ కు అధికారం దక్కుతుందా లేదా అనేది తర్వాతి సంగతి. రాహుల్ ఈ ప్రకటన అయితే చేశాడు. ఈ ప్రకటన మీద ఎంత మేరకు నిలబడతాడు అనేది కూడా తర్వాతి సంగతే. ఓవరాల్ గా ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించాలనో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనో.. రాహుల్ పిలుపునివ్వలేదు. ఇది చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికరమైన అంశమే.

First Published:  23 Feb 2019 12:22 AM GMT
Next Story