Telugu Global
Cinema & Entertainment

ఇక్కడ పోగొట్టుకుంది.... అక్కడ దక్కించుకుంది

రోజుల తేడాలో ఓ అవకాశం చేజార్చుకుంది రాశిఖన్నా. అదృష్టంకొద్దీ మరో అవకాశం దక్కించుకుంది. రెండు సినిమాల విషయంలో రాశిఖన్నాకు ఈ అనుభవం ఎదురైంది. రీసెంట్ గా తమిళ్ లో ఓ హిట్ అందుకున్న రాశిఖన్నాకు.. రాట్ససన్ అనే తమిళ సినిమా రీమేక్ లో నటించే ఛాన్స్ వచ్చింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. అంతా సెట్ అయిందనుకునే టైమ్ కు ఆ ఛాన్స్ మిస్ అయింది. రాట్ససన్ రీమేక్ లో రాశిఖన్నాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ స్థానంలో అనుపమ […]

ఇక్కడ పోగొట్టుకుంది.... అక్కడ దక్కించుకుంది
X

రోజుల తేడాలో ఓ అవకాశం చేజార్చుకుంది రాశిఖన్నా. అదృష్టంకొద్దీ మరో అవకాశం దక్కించుకుంది. రెండు సినిమాల విషయంలో రాశిఖన్నాకు ఈ అనుభవం ఎదురైంది. రీసెంట్ గా తమిళ్ లో ఓ హిట్ అందుకున్న రాశిఖన్నాకు.. రాట్ససన్ అనే తమిళ సినిమా రీమేక్ లో నటించే ఛాన్స్ వచ్చింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. అంతా సెట్ అయిందనుకునే టైమ్ కు ఆ ఛాన్స్ మిస్ అయింది.

రాట్ససన్ రీమేక్ లో రాశిఖన్నాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. దీంతో రాశి ఖన్నా కాస్త ఫీల్ అయింది. అయితే అంతలోనే మరో బ్రహ్మాండమైన ఆఫర్ అందుకుంది ఈ బ్యూటీ.

నాగచైతన్య-వెంకీ హీరోలుగా రాబోతున్న వెంకీమామ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నాను హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఇలా ఊహించని విధంగా ఓ క్రేజీ మల్టీస్టారర్ లో ఆఫర్ అందుకుంది రాశి. రేపట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

First Published:  23 Feb 2019 8:00 AM GMT
Next Story