Telugu Global
NEWS

నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావ్ కేటీఆర్..!

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్‌ను ఉత్తమ్ సరదాగా ప్రశ్నించారు. దీనికి కేటీఆర్.. నేను కేవలం మెసేజెస్ మాత్రమే చదువుతాను, మీ నెంబర్ నేను బ్లాక్ చేయలేదని స్పష్టం చేశారు. అంతకు మునుపు, సీఎల్పీ కార్యాలయానికి కేటీఆర్ మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డిలతో కలసి వచ్చారు. […]

నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావ్ కేటీఆర్..!
X

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్‌ను ఉత్తమ్ సరదాగా ప్రశ్నించారు. దీనికి కేటీఆర్.. నేను కేవలం మెసేజెస్ మాత్రమే చదువుతాను, మీ నెంబర్ నేను బ్లాక్ చేయలేదని స్పష్టం చేశారు.

అంతకు మునుపు, సీఎల్పీ కార్యాలయానికి కేటీఆర్ మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డిలతో కలసి వచ్చారు. డిప్యుటీ స్పీకర్ పదవికి జరిగే ఎన్నికను ఏకగ్రీవం చేయాలని వారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కోరారు. దీనికి వారు సీఎల్పీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అనంతరం కేటీఆర్, భట్టి, ఉత్తమ్ ఏకాంతంగా కాసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుందని…. దీనికి అధికార పార్టీ సహకరించాలని వారు కోరినట్లు తెలుస్తోంది.

First Published:  23 Feb 2019 2:00 AM GMT
Next Story