Telugu Global
NEWS

చంద్రబాబు ఓడిపోవడం 100 శాతం గ్యారెంటీ.. అధికారం వైసీపీదే : కేటీఆర్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పార్టీ అధికారం కోల్పోతుందని, చంద్రబాబు నాయుడు ఓడిపోవడం 100 శాతం గ్యారెంటీ అని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారని.. కాని అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని కేటీఆర్ జోష్యం చెప్పారు. ఇవాళ మీడియాతో కాసేపు ముచ్చటించిన కేటీఆర్ పలు విషయాలు పంచుకున్నారు. చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్‌ను కలువరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఏపీలో అధికారం చేపట్టడం […]

చంద్రబాబు ఓడిపోవడం 100 శాతం గ్యారెంటీ.. అధికారం వైసీపీదే : కేటీఆర్
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పార్టీ అధికారం కోల్పోతుందని, చంద్రబాబు నాయుడు ఓడిపోవడం 100 శాతం గ్యారెంటీ అని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారని.. కాని అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని కేటీఆర్ జోష్యం చెప్పారు.

ఇవాళ మీడియాతో కాసేపు ముచ్చటించిన కేటీఆర్ పలు విషయాలు పంచుకున్నారు. చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్‌ను కలువరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఏపీలో అధికారం చేపట్టడం ఖాయమని ఆయన చెప్పారు. కేసీఆర్.. జగన్‌ను కలవాల్సిన టైంలో తప్పక కలుస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయలేదని, కాని చంద్రబాబు మాత్రం ఏపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.

పక్క రాష్ట్రంపై, పక్క పార్టీలపై దుమ్మెత్తిపోయకుండా అసలు ఈ ఐదేళ్లలో ఏపీకి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని ఆయన సూచించారు. ఇక, కేంద్రంలో మళ్లీ మోడీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. జాతీయ పార్టీలు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, తప్పకుండా ప్రాంతీయ పార్టీలను భాగస్వామ్యులుగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ‘తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసిద్దాం’ అనే నినాదంతో వెళ్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ అభ్యర్థులను కేసీఆరే నిర్ణయిస్తారని.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

First Published:  23 Feb 2019 8:27 AM GMT
Next Story