Telugu Global
NEWS

వాళ్ళు కూడా వైసీపీ వైపు....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు రానురాను పెరుగుతోంది. ఇన్నాళ్లు రెడ్డి కులస్థులు మాత్రమే ఎక్కువగా ఉన్నారని, ఇతర కులాల వారు రావటం లేదు అని జరుగుతున్న ప్రచారానికి తెర పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభ తర్వాత బీసీలు పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై సర్వత్రా ఆమోదయోగ్యం లభించడంతో బీసీ కులాలకు చెందిన వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇక అగ్రకులాలైన […]

వాళ్ళు కూడా వైసీపీ వైపు....
X

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు రానురాను పెరుగుతోంది. ఇన్నాళ్లు రెడ్డి కులస్థులు మాత్రమే ఎక్కువగా ఉన్నారని, ఇతర కులాల వారు రావటం లేదు అని జరుగుతున్న ప్రచారానికి తెర పడుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభ తర్వాత బీసీలు పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై సర్వత్రా ఆమోదయోగ్యం లభించడంతో బీసీ కులాలకు చెందిన వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారు.

ఇక అగ్రకులాలైన బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వీరిలో చాలామంది తమ మద్దతును వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కే పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు దళితులపై చేస్తున్న వ్యాఖ్యలు, ఆగాడాలు చూసి దళితులు కూడా తమ మద్దతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కే అంటున్నారు.

ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా వైసీపీ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆ పార్టీలోకి వచ్చేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అయితే ఇది బాహాటంగా చేయకుండా లోలోపలే జరిగిపోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు అన్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే సీని హీరో అక్కినేని నాగార్జున జగన్‌ను కలిసారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని అక్కినేని కుటుంబం తొలిసారిగా బహిరంగంగా జగన్‌ను కలిసేందుకు రావడం ఇందుకు సంకేతమని అంటున్నారు.

పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జునతో సహా ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది జగన్‌ను కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు సీనియర్ లు అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాదుల ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

First Published:  22 Feb 2019 5:59 AM GMT
Next Story