Telugu Global
Health & Life Style

గుప్పెడు పల్లీలు తినండి....ఆరోగ్యంగా ఉండండి!

పల్లీలు తినండి….గుండె సంబంధిత జబ్బులకు గుడ్ బై చెప్పంది. నిత్యం గుప్పెడు పల్లీలు తీసుకున్నట్లయితే…ఆలోచనాశక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఉడకబెట్టి తింటారా? వెయించుకుని తిట్టారా? అది మీ ఇష్టం. ఎలా తిన్నా సరే….పల్లీలు తినడం మాత్రం మర్చిపోకండి. పల్లీల పచ్చడి, బెండకాయ ఫ్రైలో పల్లీలు, దొండకాయ ఫ్రైలో పల్లీలు, అంతేకాదు పల్లీలలో రకరకాల స్వీట్లు తయారు చేసుకుని తింటుంటారు. ఇలా తీసుకోవడం ద్వారా రుచితోపాటు…శరీరానికి కావాల్సినన్ని ప్రొటీన్లు లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలను […]

గుప్పెడు పల్లీలు తినండి....ఆరోగ్యంగా ఉండండి!
X

పల్లీలు తినండి….గుండె సంబంధిత జబ్బులకు గుడ్ బై చెప్పంది. నిత్యం గుప్పెడు పల్లీలు తీసుకున్నట్లయితే…ఆలోచనాశక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఉడకబెట్టి తింటారా? వెయించుకుని తిట్టారా? అది మీ ఇష్టం. ఎలా తిన్నా సరే….పల్లీలు తినడం మాత్రం మర్చిపోకండి.

పల్లీల పచ్చడి, బెండకాయ ఫ్రైలో పల్లీలు, దొండకాయ ఫ్రైలో పల్లీలు, అంతేకాదు పల్లీలలో రకరకాల స్వీట్లు తయారు చేసుకుని తింటుంటారు. ఇలా తీసుకోవడం ద్వారా రుచితోపాటు…శరీరానికి కావాల్సినన్ని ప్రొటీన్లు లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే గుండె జబ్బు రాదని శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

ప్రతిరోజు 30 గ్రాముల పల్లీలు తీసుకున్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్యులు, సైంటిస్టులు అంటున్నారు. పల్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి.

అంతేకాదు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు, ఆలోచనా శక్తిని కూడా పెంచుతాయట. దీంతో మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ప్రెగ్నెన్సీ మహిళలు నిత్యం పల్లీలు తీసుకున్నట్లయితే… కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి నిత్యం ఆహారంలో పల్లీలను భాగం చేసుకోవడం మర్చిపోకండి.

First Published:  21 Feb 2019 8:50 PM GMT
Next Story