Telugu Global
NEWS

చరిత వైసీపీని వీడడం ఖాయమేనా?

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇచ్చేందుకు జగన్‌ సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో గౌరు కుటుంబం వైసీపీని వీడేందుకు సిద్దమైనట్టు చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో టీడీపీలో చేరుతున్నట్టు గౌరు అనుచరులు చెబుతున్నారు. వైసీపీ నాయకత్వం అడుగులు కూడా కాటసానికి అనుకూలంగా పడుతున్నట్టు అర్థమవుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పాణ్యం నియోజకవర్గం నుంచి చరిత పోటీ చేసి […]

చరిత వైసీపీని వీడడం ఖాయమేనా?
X

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇచ్చేందుకు జగన్‌ సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో గౌరు కుటుంబం వైసీపీని వీడేందుకు సిద్దమైనట్టు చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో టీడీపీలో చేరుతున్నట్టు గౌరు అనుచరులు చెబుతున్నారు.

వైసీపీ నాయకత్వం అడుగులు కూడా కాటసానికి అనుకూలంగా పడుతున్నట్టు అర్థమవుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పాణ్యం నియోజకవర్గం నుంచి చరిత పోటీ చేసి గెలిచారు.

అయితే ఇక్కడ బలాబలాలను పరిశీలిస్తే కాటసాని రాంభూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. నాలుగు సార్లు పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాటసాని. అంతటి పట్టున్న రాంభూపాల్ రెడ్డిని ఈసారి బరిలో దింపితే తిరుగుండదన్నది వైసీపీ ఆలోచన. అందుకే ఈసారి గౌరు కుటుంబాన్ని పక్కన పెట్టి పాణ్యంలో పావులు కదపాలనుకుంటోంది.

అయితే జగన్‌ లండన్‌ నుంచి తిరిగి వచ్చాక గౌరు కుటుంబాన్ని బుజ్జగించి పార్టీ మారకుండా చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

First Published:  22 Feb 2019 9:48 AM GMT
Next Story