Telugu Global
Cinema & Entertainment

 "సైలెన్స్"లో అనుష్క రోల్ ఇదేనట

స్టార్ హీరోయిన్ అనుష్క “భాగమతి” లాంటి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ లో ఫారిన్ వెళ్లి అక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ తో తన బరువు తగ్గించుకుంది. అనుష్క బరువు తగ్గాక దిగిన పిక్స్ ఇటీవలే సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇదంతా అనుష్క “సైలెన్స్” (నిశ్శబ్ధం టైటిల్ ప్రచారంలో ఉంది) అనే సినిమా కోసం చేస్తుంది. పూర్తి స్థాయి డార్క్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ సినిమాని […]

 సైలెన్స్లో అనుష్క రోల్ ఇదేనట
X

స్టార్ హీరోయిన్ అనుష్క “భాగమతి” లాంటి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ లో ఫారిన్ వెళ్లి అక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ తో తన బరువు తగ్గించుకుంది. అనుష్క బరువు తగ్గాక దిగిన పిక్స్ ఇటీవలే సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేశాయి.

అయితే ఇదంతా అనుష్క “సైలెన్స్” (నిశ్శబ్ధం టైటిల్ ప్రచారంలో ఉంది) అనే సినిమా కోసం చేస్తుంది. పూర్తి స్థాయి డార్క్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ సినిమాని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక అనుష్క ఈ సినిమాలో ఎన్నారై గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా కథ మొత్తం అనుష్క పాత్ర చుట్టే తిరుగుతుందట. కథ కూడా సగానికి పైగా ఫారిన్ లోనే షూటింగ్ జరుపుకోబోతుందట.

ఈ సినిమా లో అనుష్క తో పాటు మాధవన్, సుబ్బరాజ్, శాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కోన ఫిలిం కార్పోరేష‌న్ పై కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పై విశ్వ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.

First Published:  22 Feb 2019 12:05 AM GMT
Next Story