Telugu Global
NEWS

చంద్ర‌బాబు కోసం రేవంత్ మాట త‌ప్పారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఓ మాట చెప్పారు. కొడంగ‌ల్‌లో ఓట‌మి త‌ర్వాత కొంత నిరాశ‌ చెందిన రేవంత్…. అప్ప‌ట్లో తాను ఈ శ‌ప‌థం చేస్తున్న‌ట్లు మీడియా ప్ర‌తినిధుల‌కు తెలిపారు. కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌ల‌కు హాజ‌రైన రేవంత్ చెప్పిన మాట ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు మీడియా ముందుకు తాను రాను అని ప్ర‌క‌టించారు. మీడియా మైక్‌ల ముందుకు వ‌చ్చేది లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి […]

చంద్ర‌బాబు కోసం రేవంత్ మాట త‌ప్పారా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఓ మాట చెప్పారు. కొడంగ‌ల్‌లో ఓట‌మి త‌ర్వాత కొంత నిరాశ‌ చెందిన రేవంత్…. అప్ప‌ట్లో తాను ఈ శ‌ప‌థం చేస్తున్న‌ట్లు మీడియా ప్ర‌తినిధుల‌కు తెలిపారు. కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌ల‌కు హాజ‌రైన రేవంత్ చెప్పిన మాట ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు మీడియా ముందుకు తాను రాను అని ప్ర‌క‌టించారు. మీడియా మైక్‌ల ముందుకు వ‌చ్చేది లేదని తేల్చి చెప్పారు.

రేవంత్ రెడ్డి అన్న‌ట్లుగానే డిసెంబ‌ర్‌లో ఫలితాలు వ‌చ్చిన త‌ర్వాత నుంచి ఫిబ్ర‌వ‌రి 20 వ‌ర‌కు మీడియా ముందుకు రాలేదు. గొట్టాల ముందు ఫోజు కొట్ట‌లేదు. అప్పుడ‌ప్పుడు చిట్‌ చాట్‌ల‌తోనే త‌న మ‌నోగ‌తం వెల్ల‌డించారు. ఈ మ‌ధ్య‌నే హ‌రీష్‌రావుకు మంత్రి ప‌ద‌వి రాద‌నే విశ్లేష‌ణ చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ మాత్రం త‌న బాస్ చంద్ర‌బాబు కోసం మాట త‌ప్పారు. రెండేళ్ల వ‌ర‌కు మీడియా ముందుకు రానని చెప్పిన రేవంత్ …. ఈడీ రెండు రోజుల విచార‌ణ‌కు హాజ‌రైన త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. చంద్ర‌బాబుని టార్గెట్ చేయ‌డం కోస‌మే త‌న‌ని విచార‌ణ‌కు పిలిపించార‌ని ఏదో లాజిక్‌లు లాగారు.

మొత్తానికి మ‌రోసారి చంద్ర‌బాబు కోసం రేవంత్ త‌న మాట తప్పార‌ని ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు వేసిన ప్లాన్‌లో భాగంగా ఎమ్మెల్సీ సీటు కోసం బేరాలు చేస్తూ ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇరుక్కున్నారు. ఇప్పుడు అదే బాస్ కోసం తాను చెప్పిన మాట‌నే తాను త‌ప్పార‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు అనుకోవ‌డం విన్పిస్తోంది.

అంతేకాకుండా మొన్న‌టి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వ‌ల్లే కాంగ్రెస్ సీట్లు త‌గ్గాయ‌నేది ఆ పార్టీ నేత‌ల భావ‌న‌. చంద్ర‌బాబు భజన వ‌ద‌లకుంటే రేవంత్ రెడ్డి కూడా భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో నెగ్గుకురావ‌డం క‌ష్ట‌మ‌నేది ఆయ‌న దగ్గ‌రి నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. చంద్ర‌బాబు నీడ‌ను కూడా తెలంగాణ ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని…ఈ విష‌యాన్ని రేవంత్ ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిద‌ని వీరు గుర్తు చేస్తున్నారు. చంద్ర‌బాబు నీడ‌లో కొనసాగినంత కాలం రేవంత్ రాజ‌కీయంగా పైకి రావ‌డం క‌ష్ట‌మ‌నేది వీరి భావ‌న‌. మ‌రీ రేవంత్ ఈ విష‌యాన్ని ఎప్పుడూ గుర్తిస్తారో..!

First Published:  20 Feb 2019 11:06 PM GMT
Next Story