Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ గా అనుకుంటే ఐటెం గర్ల్ పాత్ర ఇచ్చారు

నాని, విక్రం కే కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళే ఈ సినిమాలో “ఆర్ ఎక్స్ 100” ఫేం కార్తికేయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాని ఐదుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్సే కాకుండా […]

హీరోయిన్ గా అనుకుంటే ఐటెం గర్ల్ పాత్ర ఇచ్చారు
X

నాని, విక్రం కే కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళే ఈ సినిమాలో “ఆర్ ఎక్స్ 100” ఫేం కార్తికేయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాని ఐదుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు.

అయితే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్సే కాకుండా ఒక ఐటెం సాంగ్ కోసం ఇంకో హీరోయిన్ కూడా ఉందట. ఈ ఐటెం సాంగ్ లో నాని పక్కన డాన్స్ చెయ్యడానికి రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నాడట విక్రం కే కుమార్.

మొదట ఇదే సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐటెం గర్ల్ గా తీసుకోబోతున్నారు.

హీరోయిన్ గా ప్రస్తుతం అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్…. ఈ ఆఫర్ కి ఒప్పుకుందని టాక్. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిచబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, మెగా ఆకాష్, ప్రియ వారియర్ లు హీరోయిన్స్ గా నటించే అవకాశం ఉంది.

First Published:  21 Feb 2019 12:02 AM GMT
Next Story