Telugu Global
NEWS

ఒక్క ఏడాదిలో 70,44,289 బిర్యానీలు.... లిమ్కా బుక్‌లో ప్యారడైజ్ రెస్టారెంట్

బిర్యానీ… ఈ వంటకానికి హైదరాబాద్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. నిజాం నవాబులు పరిచయం చేసిన ఈ వంటకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది మాంస ప్రియులకు ఇష్టమైన డిష్. కాని, దేశంలో ఎన్నో రకాల బిర్యానీలు లభిస్తున్నా.. హైదరాబాద్ బిర్యానీకి ఉండే టేస్టే వేరు. అందుకే హైదరాబాదీ బిర్యానీకి స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక హైదరాబాద్‌లో బిర్యానీ అంటే అందరికీ గుర్తొచ్చే రెస్టారెంట్ ప్యారడైజ్. నగరంలో ఎన్నో రెస్టారెంట్లు ఉన్నా ఈ ప్యారడైజ్ బిర్యానీకి ఉండే టేస్ట్ […]

ఒక్క ఏడాదిలో 70,44,289 బిర్యానీలు.... లిమ్కా బుక్‌లో ప్యారడైజ్ రెస్టారెంట్
X

బిర్యానీ… ఈ వంటకానికి హైదరాబాద్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. నిజాం నవాబులు పరిచయం చేసిన ఈ వంటకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది మాంస ప్రియులకు ఇష్టమైన డిష్. కాని, దేశంలో ఎన్నో రకాల బిర్యానీలు లభిస్తున్నా.. హైదరాబాద్ బిర్యానీకి ఉండే టేస్టే వేరు. అందుకే హైదరాబాదీ బిర్యానీకి స్పెషల్ క్రేజ్ ఉంది.

ఇక హైదరాబాద్‌లో బిర్యానీ అంటే అందరికీ గుర్తొచ్చే రెస్టారెంట్ ప్యారడైజ్. నగరంలో ఎన్నో రెస్టారెంట్లు ఉన్నా ఈ ప్యారడైజ్ బిర్యానీకి ఉండే టేస్ట్ డిఫరెంట్. ఇప్పుడా రెస్టారెంట్ అత్యధిక బిర్యానీలు సర్వ్ చేసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

1 జనవరి 2017 నుంచి 31 జనవరి 2017 మధ్య ఏకంగా 70 లక్షల 44 వేల 289 బిర్యానీలను వినియోగదారులకు అందించి 2019 లిమ్కాబుక్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఒక ఏడాదిలో అత్యధిక బిర్యానీలు అందించిన రెస్టారెంట్ ప్యారడైజే కావడం గమనార్హం.

ముంబైలో నిర్వహించిన ఏసియా ఫుడ్ కాంగ్రెస్‌లో ఇవాళ ఈ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ చైర్మన్ అలీ హేమతికి జీవనసాఫల్య పురస్కారం లభించింది.

1953లో ప్యారడైజ్ అనే సినిమా థియేటర్ లో క్యాంటీన్‌గా ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి ఇవాళ బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, విజయవాడ ప్రాంతాలకు కూడా విస్తరించింది. దేశవ్యాప్తంగా ప్రముఖులు హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ప్యారడైజ్ బిర్యానీ రుచి చూస్తుంటారు.

First Published:  21 Feb 2019 8:26 AM GMT
Next Story