Telugu Global
International

భారత్ సంచలన నిర్ణయం.... పాకిస్థాన్‌కు నది జలాలు కట్

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను పలు మార్గాల్లో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇండస్ నదీ జలాలను పాకిస్థాన్‌కు వెళ్లనివ్వబోమని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు పాకిస్థాన్ వినియోగిస్తున్న నీటిని జమ్ము- కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు మళ్లిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. నీటిని ఆపేస్తున్నట్టు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ కూడా ధృవీకరించారు. నీటిని ఆపేయాలన్న నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నదిగా స్పష్టం చేశారు. ఇకపై మూడు నదీ జలాలపై పూర్తి హక్కులు భారత్‌కే ఉంటాయని […]

భారత్ సంచలన నిర్ణయం.... పాకిస్థాన్‌కు నది జలాలు కట్
X

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను పలు మార్గాల్లో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇండస్ నదీ జలాలను పాకిస్థాన్‌కు వెళ్లనివ్వబోమని కేంద్రం ప్రకటించింది.

ఇప్పటి వరకు పాకిస్థాన్ వినియోగిస్తున్న నీటిని జమ్ము- కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు మళ్లిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. నీటిని ఆపేస్తున్నట్టు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ కూడా ధృవీకరించారు. నీటిని ఆపేయాలన్న నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నదిగా స్పష్టం చేశారు. ఇకపై మూడు నదీ జలాలపై పూర్తి హక్కులు భారత్‌కే ఉంటాయని స్పష్టం చేశారు గడ్కరీ.

Next Story