Telugu Global
NEWS

పోకిరీలతోనే హంపి స్తంభాలు ఎత్తించిన పోలీసులు

శ్రీకృష్ణదేవరాయల రాజధాని హంపిలో గతేడాది స్తంభాలను కూల్చేసిన ఆకతాయిలకు కోర్టు శిక్ష విధించింది. అరుదైన తీర్పు చెప్పింది. గతేడాది హంపిలో ఒక అల్లరిమూక పర్యటనకు వచ్చి… అక్కడి స్తంభాలను పడగొట్టారు. అదేదో ఘనకార్యం అన్నట్టు వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో దుమారం రేగింది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన హంపిలో ఇలాంటి ఘటన జరగడం చూసి అందరూ షాక్‌ అయ్యారు. స్తంభాలను కూల్చినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్దెత్తున డిమాండ్ వచ్చింది. కొందరు […]

పోకిరీలతోనే హంపి స్తంభాలు ఎత్తించిన పోలీసులు
X

శ్రీకృష్ణదేవరాయల రాజధాని హంపిలో గతేడాది స్తంభాలను కూల్చేసిన ఆకతాయిలకు కోర్టు శిక్ష విధించింది. అరుదైన తీర్పు చెప్పింది. గతేడాది హంపిలో ఒక అల్లరిమూక పర్యటనకు వచ్చి… అక్కడి స్తంభాలను పడగొట్టారు.

అదేదో ఘనకార్యం అన్నట్టు వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో దుమారం రేగింది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన హంపిలో ఇలాంటి ఘటన జరగడం చూసి అందరూ షాక్‌ అయ్యారు. స్తంభాలను కూల్చినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్దెత్తున డిమాండ్ వచ్చింది. కొందరు ధర్నాలు కూడా నిర్వహించారు.

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ఆకతాయిలను అరెస్ట్ చేసి కేసు పెట్టారు. కేసు విచారించిన కోర్టు అకతాయిలకు 70వేల జరిమానా విధించింది. కూలిన స్తంభాలను తిరిగి ఆ ఆకతాయిలతోనే నిలబెట్టాలని…ఈ పని
పోలీసుల సమక్షంలో జరగాలని ఆదేశించింది.

దీంతో పోలీసులు దోషులను హంపి తీసుకెళ్లి వారితోనే స్తంభాలను ఎత్తించారు. 14 వ శతాబ్ధానికి చెందిన హంపి శిథిలాలు 4100 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. సుమారు 16వందల నిర్మాణాలు ఉన్నాయి. దండయాత్రకు వచ్చిన రాజులు హంపి వైభవాన్ని చూసి కళ్లుకుట్టి చాలా వరకు నిర్మాణాలను ధ్వంసం చేశారు.

First Published:  20 Feb 2019 8:35 PM GMT
Next Story