Telugu Global
Cinema & Entertainment

హీరో లేకుండానే సెట్స్ పైకొచ్చింది

హీరో లేకుండా సినిమా సెట్స్ పైకి రావడం కొత్తేం కాదు. ఇంకా చెప్పాలంటే చాలామంది స్టార్ హీరోలు ఫస్ట్ షెడ్యూల్ కు రానే రారు. ఆ తర్వాత మాత్రమే సెట్స్ పైకి వస్తారు. కానీ ఇక్కడ విషయం వేరు. సినిమాలో హీరో ఎవరనేది ఫిక్స్ అవ్వకుండానే మూవీ సెట్స్ పైకి వచ్చింది. అదే వాల్మీకి సినిమా. అవును.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇవాళ్టి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య […]

హీరో లేకుండానే సెట్స్ పైకొచ్చింది
X

హీరో లేకుండా సినిమా సెట్స్ పైకి రావడం కొత్తేం కాదు. ఇంకా చెప్పాలంటే చాలామంది స్టార్ హీరోలు ఫస్ట్ షెడ్యూల్ కు రానే రారు. ఆ తర్వాత మాత్రమే సెట్స్ పైకి వస్తారు. కానీ ఇక్కడ విషయం వేరు. సినిమాలో హీరో ఎవరనేది ఫిక్స్ అవ్వకుండానే మూవీ సెట్స్ పైకి వచ్చింది. అదే వాల్మీకి సినిమా.

అవును.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇవాళ్టి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య కొన్ని సన్నివేశాలు తీశాడు హరీష్ శంకర్. అలా డీజే తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఇన్నాళ్లకు మెగాఫోన్ పట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో ఇంకో హీరో ఎవరనేది ఇంకా తేలనే లేదు.

తమిళ హిట్ మూవీ జిగర్తాండాకు రీమేక్ గా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో ఓ పాత్రకు వరుణ్ తేజ్ ను తీసుకున్నారు. కానీ ఇది హీరో పాత్ర కాదు. ఇందులో వరుణ్ ది విలన్ పాత్ర. హీరో పాత్ర కోసం శ్రీవిష్ణు సంప్రదించారు. కానీ క్యారెక్టర్ బరువైనది కాదనే ఉద్దేశంతో అతడు తప్పుకున్నాడు. తమిళ హీరో అధర్వను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కానీ అది కూడా ఇంకా ఎలాంటి ఫలితాల్ని ఇవ్వలేదు.

అంతలోనే హీరో లేకుండా వాల్మీకి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. త్వరలోనే వస్తానని ట్వీట్ చేశాడు ఈ హీరో.

First Published:  21 Feb 2019 9:01 AM GMT
Next Story