Telugu Global
NEWS

హైదరాబాద్‌లో గూగుల్‌ భారీ క్యాంపస్

హైదరాబాద్‌లో గూగుల్ సంస్థ మరో భారీ క్యాంపస్‌ను నిర్మించబోతోంది. హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 7.2 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. 22 అంతస్తుల ఈ భవనంలో 13 వేల మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. ప్రస్తుతం కొండాపూర్ లో ఉన్న గూగుల్‌ క్యాంపస్‌లో ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్తగా నిర్మించబోతున్న క్యాంపస్‌ను గూగుల్ సొంతంగా నిర్మిస్తోంది. ఇప్పటివరకు కొండాపూర్‌లోని క్యాంపస్‌ అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న క్యాంపస్‌ ఏసియాలో గూగుల్‌కు ఉన్న అతిపెద్ద క్యాంపస్‌గా నిలవనుంది. త్వరలోనే ఈ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. […]

హైదరాబాద్‌లో గూగుల్‌ భారీ క్యాంపస్
X

హైదరాబాద్‌లో గూగుల్ సంస్థ మరో భారీ క్యాంపస్‌ను నిర్మించబోతోంది. హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 7.2 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. 22 అంతస్తుల ఈ భవనంలో 13 వేల మంది ఉద్యోగులు పనిచేయనున్నారు.

ప్రస్తుతం కొండాపూర్ లో ఉన్న గూగుల్‌ క్యాంపస్‌లో ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్తగా నిర్మించబోతున్న క్యాంపస్‌ను గూగుల్ సొంతంగా నిర్మిస్తోంది. ఇప్పటివరకు కొండాపూర్‌లోని క్యాంపస్‌ అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న క్యాంపస్‌ ఏసియాలో గూగుల్‌కు ఉన్న అతిపెద్ద క్యాంపస్‌గా నిలవనుంది.

త్వరలోనే ఈ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. 2015లో యూఎస్ పర్యటన సందర్బంగా గూగుల్‌తో చేసుకున్న ఒప్పందం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ క్యాంపస్‌ నిర్మాణానికి
7.2 ఎకరాల భూమిని కేటాయించింది.

First Published:  20 Feb 2019 10:31 PM GMT
Next Story