Telugu Global
Cinema & Entertainment

ఈసారి రెండు చోట్లా డిజాస్టరే

కార్తి ఆమధ్య చేసిన చినబాబు సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ అదే సినిమా తమిళ్ లో హిట్ అయింది. దీంతో ఇక్కడ నష్టాలు అక్కడ భర్తీ అయ్యాయి. ఓవరాల్ గా చినబాబు సేఫ్ వెంచర్ అనిపించుకుంది. కానీ తాజాగా కార్తి నటించిన దేవ్ సినిమా విషయానికొచ్చేసరికి మాత్రం బ్యాలెన్స్ షీట్ తేడా కొట్టేసింది. దేవ్ సినిమా తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. విడుదలైన ఈ 6 రోజుల్లో తమిళనాట […]

ఈసారి రెండు చోట్లా డిజాస్టరే
X

కార్తి ఆమధ్య చేసిన చినబాబు సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ అదే సినిమా తమిళ్ లో హిట్ అయింది. దీంతో ఇక్కడ నష్టాలు అక్కడ భర్తీ అయ్యాయి. ఓవరాల్ గా చినబాబు సేఫ్ వెంచర్ అనిపించుకుంది. కానీ తాజాగా కార్తి నటించిన దేవ్ సినిమా విషయానికొచ్చేసరికి మాత్రం బ్యాలెన్స్ షీట్ తేడా కొట్టేసింది.

దేవ్ సినిమా తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. విడుదలైన ఈ 6 రోజుల్లో తమిళనాట ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల షేర్ రాగా, తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కోటి 85 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తమిళనాడులో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 17 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 12 కోట్ల రూపాయలు రావాలి.

ఇటు తెలుగులో కూడా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 6 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే ఇక్కడ కూడా అటుఇటుగా 4 కోట్ల రూపాయలు రావాలి. అటు కోలీవుడ్ నుంచి 12 కోట్లు, టాలీవుడ్ నుంచి 4 కోట్లు రావడం అసంభవం. దీంతో పెట్టిన పెట్టుబడిలో దాదాపు 70శాతం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ హీరోకైనా నష్టాలు సహజం. కానీ 50శాతానికి పైగా నష్టాలు వస్తే మాత్రం అతడి మార్కెట్ వాల్యూ అమాంతం పడిపోతుంది. కార్తి మార్కెట్ ఏ మేరకు పడిందో తెలియాలంటే నెక్ట్స్ సినిమా బిజినెస్ స్టార్ట్ అవ్వాలి.

First Published:  20 Feb 2019 7:02 PM GMT
Next Story