Telugu Global
NEWS

నకిలీ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నకిలీ ఓట్లు నమోదు కావడంపై ఏపీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘంపై సీరియస్ అయ్యింది. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) ఆదేశించింది. ఏపీలో భారీగా నకిలీ వోట్లు నమోదయ్యాయంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఇలా స్పందించింది. పిటిషనర్ లేవనెత్తిన అన్ని అనుమానాలను ఈసీఐ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది. కాగా, 1.55 లక్షల […]

నకిలీ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరిన ఏపీ హైకోర్టు
X

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నకిలీ ఓట్లు నమోదు కావడంపై ఏపీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘంపై సీరియస్ అయ్యింది. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) ఆదేశించింది. ఏపీలో భారీగా నకిలీ వోట్లు నమోదయ్యాయంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఇలా స్పందించింది.

పిటిషనర్ లేవనెత్తిన అన్ని అనుమానాలను ఈసీఐ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది. కాగా, 1.55 లక్షల నకిలీ వోట్లను తొలగించామని ఈసీఐ కోర్టుకు విన్నవించగా.. పిటిషనర్ మాత్రం నకిలీ వోట్లు గతంలో కంటే 3 లక్షలు పెరిగి 59 లక్షలకు చేరుకున్నాయని వాదిస్తున్నారు.

ఈ వివాదం మొదటి నుంచి గమనిస్తే… రాష్ట్రంలో 56 లక్షల నకిలీ వోట్లు ఉన్నాయని కోర్టులో పిల్ వేశారు. ఈ పిల్‌కు సమాధానంగా 26 డిసెంబర్ 2018న ఈసీఐ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. నకిలీ వోట్లను పూర్తిగా తీసేశామని ఎన్నికల సంఘం ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఆ తర్వాతి రోజే నకిలీ వోట్లు పూర్తిగా తొలగించలేదని…. ఈ విషయం కొత్తగా ప్రచురించిన వోటర్ల జాబితాలో స్పష్టమవుతోందని మరో సారి సుధాకర్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు.

దీనిపై ఈసీఐ మరో సారి అఫిడవిట్ సమర్పించింది. మేం నకిలీగా గుర్తించిన 1.55 లక్షల ఓట్లను తొలగించామని.. ఆ తర్వాతే 2019 జనవరి 11న కొత్త ఓటర్ జాబితాను ముద్రించామని పేర్కొంది. కాని ఈసీఐ వాదనపై పిటిషనర్ సుధాకర్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా ఓటరు జాబితాలో తప్పులను సరి చేయకుండా ఎన్నికలు నిర్వహించినందుకు ఆ రాష్ట్ర సీఈవో క్షమాపణలు చెప్పారని.. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే తప్పు జరుగబోతోందని సుధాకర్ రెడ్డి వాదించారు.

2018 సెప్టెంబర్‌లో 56 లక్షల నకిలీ వోట్లు ఉంటే 2019 జనవరిలో ఆ సంఖ్య 59 లక్షలకు చేరిందని కోర్టుకు చెప్పారు. 3 లక్షల మేర నకిలీ ఓటర్లు ఏపీ జాబితాలో పెరిగారని…. ఈ లోపాలను వెంటనే సరి చేసేలా కోర్టు ఆదేశించాలని సుధాకర్ కోరారు.

First Published:  21 Feb 2019 7:26 AM GMT
Next Story