Telugu Global
Cinema & Entertainment

కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన ప్రభాస్ ?

“బాహుబలి” సినిమా తరువాత ప్రభాస్ కోసం ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఎదురు చూశారు. కానీ ప్రభాస్ మాత్రం వారెవ్వరికి అవకాశం ఇవ్వకుండా కేవలం ఒక్క సినిమాని మాత్రమే డైరెక్ట్ చేసిన సుజీత్ కి అవకాశం ఇచ్చి “సాహో” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా ప్రభాస్ “జిల్” లాంటి యావరేజ్ సినిమాని డైరెక్ట్ చేసిన రాధా క్రిష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ప్రభాస్ […]

కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన ప్రభాస్ ?
X

“బాహుబలి” సినిమా తరువాత ప్రభాస్ కోసం ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఎదురు చూశారు. కానీ ప్రభాస్ మాత్రం వారెవ్వరికి అవకాశం ఇవ్వకుండా కేవలం ఒక్క సినిమాని మాత్రమే డైరెక్ట్ చేసిన సుజీత్ కి అవకాశం ఇచ్చి “సాహో” సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత కూడా ప్రభాస్ “జిల్” లాంటి యావరేజ్ సినిమాని డైరెక్ట్ చేసిన రాధా క్రిష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ప్రభాస్ ముందుకి వచ్చాడని తెలుస్తోంది. ఆ డైరెక్టర్ పేరు క్రిష్ణ. రాజమౌళి దగ్గర “బాహుబలి” ప్రాజెక్ట్ లో పని చేశాడు. ఇటీవలే రాజమౌళి క్రిష్ణ ని ప్రభాస్ దగ్గరకి పంపించాడట. ఇక క్రిష్ణ చెప్పిన లైన్ విని ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడని టాక్.

ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తవ్వగానే క్రిష్ణ సినిమా కథ గురించి ఆలోచిస్తాడట ప్రభాస్. దీన్ని బట్టి చూస్తుంటే ప్రభాస్ తదుపరి సినిమా కూడా స్టార్ డైరెక్టర్ చేతిలోకి వెళ్ళే అవకాశం లేదనిపిస్తోంది.

First Published:  20 Feb 2019 6:30 AM GMT
Next Story