Telugu Global
NEWS

ఫిరాయింపు నేత జ్యోతులకు షాక్‌

ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు షాక్ తప్పేలా లేదు. ఆయన సీటుకు ఎసరొచ్చేలాగే ఉంది. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి వైసీపీ తరపున గెలిచిన జ్యోతుల నెహ్రు ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. తొలుత బాగానే ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ నాయకత్వం ఆ తర్వాత ఆయన్ను ఒక సాధారణ నేతగానే చూస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా జగ్గంపేట టికెట్‌ కోసం కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబం పోటీకి రావడంతో జ్యోతుల నెహ్రు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యం కారణంగా తాను ఎంపీగా పోటీ […]

ఫిరాయింపు నేత జ్యోతులకు షాక్‌
X

ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు షాక్ తప్పేలా లేదు. ఆయన సీటుకు ఎసరొచ్చేలాగే ఉంది. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి వైసీపీ తరపున గెలిచిన జ్యోతుల నెహ్రు ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. తొలుత బాగానే ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ నాయకత్వం ఆ తర్వాత ఆయన్ను ఒక సాధారణ నేతగానే చూస్తూ వచ్చింది.

ఇప్పుడు తాజాగా జగ్గంపేట టికెట్‌ కోసం కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబం పోటీకి రావడంతో జ్యోతుల నెహ్రు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యం కారణంగా తాను ఎంపీగా పోటీ చేయలేనని… కాబట్టి ఈసారి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ తన
భార్యకు కేటాయించాలని ముఖ్యమంత్రిని కలిసి తోట నరసింహం డిమాండ్ చేశారు.

గతంలో తాను జగ్గంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని కూడా చంద్రబాబుకు గుర్తు చేశారు తోట. సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తోట నరసింహం ఇక తేల్చాల్సింది చంద్రబాబేనని చెప్పి వెళ్లిపోయారు. టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి జగ్గంపేటలో తోట నరసింహం అనుచరులను జ్యోతుల వేధింపులకు గురి చేశారన్న భావన ఉంది.

ఈ నేపథ్యంలోనే అదును చూసి జ్యోతులకు తోట నరసింహం చెక్ పెట్టేందుకే జగ్గంపేట టికెట్‌ను తన భార్యకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ పెట్టినట్టు భావిస్తున్నారు. జగ్గంపేట టికెట్ కోసం తోట పట్టుపడుతున్నారన్న విషయం తెలియగానే జ్యోతుల నెహ్రు సీఎంను కలిశారు.

అయితే జగ్గంపేట టికెట్‌ను గత ఎన్నికల సమయంలో అండగా నిలిచిన తోట నరసింహంకు ఇవ్వాలా… లేక ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు వైపే నిలబడలా అన్న దానిపై చంద్రబాబు ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.

First Published:  19 Feb 2019 9:47 PM GMT
Next Story