Telugu Global
Cinema & Entertainment

"మహానాయకుడు" విషయంలో బాలక్రిష్ణ అందుకే సైలెంట్ గా ఉన్నాడట

బాలక్రిష్ణ “ఎన్టీఆర్ కథానాయకుడు” పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. కానీ బాలక్రిష్ణ అంచనాల్ని తారుమారు చేస్తూ ఆ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ నెల 22 న “ఎన్టీఆర్” పార్ట్ 2 అయిన “మహానాయకుడు” రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాని బాలక్రిష్ణ అస్సలు ప్రమోట్ చెయ్యట్లేదు. అలాగే క్రిష్‌ కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వటంలేదు. కేవలం ట్రయిలర్‌ మినహా […]

మహానాయకుడు విషయంలో బాలక్రిష్ణ అందుకే సైలెంట్ గా ఉన్నాడట
X

బాలక్రిష్ణ “ఎన్టీఆర్ కథానాయకుడు” పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. కానీ బాలక్రిష్ణ అంచనాల్ని తారుమారు చేస్తూ ఆ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయింది.

ఇక ఇప్పుడు ఈ నెల 22 న “ఎన్టీఆర్” పార్ట్ 2 అయిన “మహానాయకుడు” రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాని బాలక్రిష్ణ అస్సలు ప్రమోట్ చెయ్యట్లేదు. అలాగే క్రిష్‌ కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వటంలేదు. కేవలం ట్రయిలర్‌ మినహా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి హడావుడి లేదు. మూవీ యూనిట్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని అనంతపూర్‌లో చేయాలని మొదట అనుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం వద్దని చెప్పాడట.

మొదటి భాగం ఫ్లాప్ అవ్వడంతో ఎంత ప్రచారం చేసినా వృధా అని బాలక్రిష్ణ భావిస్తున్నాడట. సినిమా విడుదలయిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తే అప్పుడు బాగా పబ్లిసిటీ చేద్దామని, సక్సెస్‌ ఈవెంట్‌ ఘనంగా బహిరంగ వేదికపై నిర్వహిద్దామని చెప్పాడట. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో బాలక్రిష్ణ సైలెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందనేది తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

First Published:  20 Feb 2019 9:00 AM GMT
Next Story