Telugu Global
NEWS

ప్రమాణ స్వీకారోత్సవంలో పక్కపక్కనే కేటీఆర్, హరీష్

తెలంగాణ కొత్త మంత్రులుగా నేడు 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది సేపటి క్రితమే గవర్నర్ నర్సింహన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో నలుగురు పాతవారు కాగా ఆరుగురు కొత్తవారికి చోటు దక్కింది. గత ప్రభుత్వ హయాంలో కీలకమైన శాఖలు నిర్వహించిన కేటీఆర్, హరీష్ రావులకు చోటు దక్కలేదు. అయితే వీరిద్దరూ ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వేదిక ఎదుట ఏర్పాటు చేసిన కుర్చీల్లోని రెండో లైన్లో కూర్చున్నారు. రాజ్‌భవన్‌కు ముందుగానే చేరుకున్న […]

ప్రమాణ స్వీకారోత్సవంలో పక్కపక్కనే కేటీఆర్, హరీష్
X

తెలంగాణ కొత్త మంత్రులుగా నేడు 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది సేపటి క్రితమే గవర్నర్ నర్సింహన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో నలుగురు పాతవారు కాగా ఆరుగురు కొత్తవారికి చోటు దక్కింది.

గత ప్రభుత్వ హయాంలో కీలకమైన శాఖలు నిర్వహించిన కేటీఆర్, హరీష్ రావులకు చోటు దక్కలేదు. అయితే వీరిద్దరూ ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వేదిక ఎదుట ఏర్పాటు చేసిన కుర్చీల్లోని రెండో లైన్లో కూర్చున్నారు.

రాజ్‌భవన్‌కు ముందుగానే చేరుకున్న కేటీఆర్ అందరినీ కలిసి శుభాకాంక్షలు తెలిపి రెండో లైన్లో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత హరీష్ రావు అక్కడకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారిని కలిసి తిరిగి వచ్చి కేటీఆర్ పక్కన కూర్చున్నారు. ప్రమాణ స్వీకార సభ జరిగే సమయంలో వీరిద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది.

దిల్ రాజు హల్ చల్….

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి టాలీవుడ్ పాపులర్ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. కొత్త మంత్రిగా ప్రమాణం చేసిన నిరంజన్ రెడ్డికి సన్నిహితుడైన దిల్ రాజు.. ఆయన ఆహ్వానం మేరకు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులతో దిల్ రాజు నవ్వుతూ ముచ్చటించడం కనిపించింది. ఆ తర్వాత కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

First Published:  19 Feb 2019 1:11 AM GMT
Next Story