Telugu Global
Cinema & Entertainment

మైత్రీ.... మరో ఇంట్రెస్టింగ్ టైటిల్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ అయింది. దాని పేరు ”మత్తు వదలరా”. మైత్రీ బ్యానర్ పై ఓ టైటిల్ ఫిక్స్ అయిందనగానే అందరి దృష్టి మహేష్-సుకుమార్ సినిమాపైన పడింది. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న బడా సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేసి ఉంటారంటూ ప్రచారం జరిగింది. కానీ మహేష్ మూవీ కోసం ఫిక్స్ చేసిన టైటిల్ కాదిది. బడా సినిమాలతో పాటు మైత్రీ నిర్మాతలు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్న విషయం […]

మైత్రీ.... మరో ఇంట్రెస్టింగ్ టైటిల్
X

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ అయింది. దాని పేరు ”మత్తు వదలరా”. మైత్రీ బ్యానర్ పై ఓ టైటిల్ ఫిక్స్ అయిందనగానే అందరి దృష్టి మహేష్-సుకుమార్ సినిమాపైన పడింది. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న బడా సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేసి ఉంటారంటూ ప్రచారం జరిగింది. కానీ మహేష్ మూవీ కోసం ఫిక్స్ చేసిన టైటిల్ కాదిది.

బడా సినిమాలతో పాటు మైత్రీ నిర్మాతలు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రితేష్ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అంతా కొత్తవాళ్లతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి మత్తు వదలరా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

యంగ్ టీమ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.

First Published:  18 Feb 2019 2:13 AM GMT
Next Story