Telugu Global
NEWS

ఉత్తరాంధ్రలో సైకిల్ పంక్చర్ తప్పదా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీని ఇక్కట్లు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఉత్తరాంధ్ర కు ముఖ ద్వారమైన విశాఖపట్నం జిల్లాలో గ్రూపు తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎసీపీలో చేరిపోయారు. ఆయన మాస్ లీడర్ కాకపోయినా జిల్లాలో కొన్ని సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేరికతో వై ఎస్ ఆర్ […]

ఉత్తరాంధ్రలో సైకిల్ పంక్చర్ తప్పదా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీని ఇక్కట్లు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఉత్తరాంధ్ర కు ముఖ ద్వారమైన విశాఖపట్నం జిల్లాలో గ్రూపు తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎసీపీలో చేరిపోయారు. ఆయన మాస్ లీడర్ కాకపోయినా జిల్లాలో కొన్ని సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేరికతో వై ఎస్ ఆర్ సి పి తన బలాన్ని పెంచుకుంటుంది.

జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ల మధ్య వైరం పార్టీ పుట్టి ముంచే లా ఉంది. ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ మైదాన ప్రాంతాల్లో కూడా నాయకుల మధ్య వివాదాలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు, సుజయ కృష్ణ రంగారావు మధ్య ఉన్న వైరం రోజురోజుకు పెరుగుతోంది. తనను సంప్రదించకుండా సుజయ కృష్ణ రంగారావును పార్టీలోకి తీసుకున్నారని, మంత్రి పదవి కూడా ఇచ్చారని అశోక్ గజపతిరాజు అలక మీద ఉన్నారు.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీని వీడతారని అంటున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కూడా చెప్పినట్టు సమాచారం. శనివారం నాడు జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా అశోక్ గజపతి రాజు హాజరుకాలేదు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖామమని అంటున్నారు.

విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు, సుజయ కృష్ణ రంగారావుల వర్గాల మధ్య వైరం పార్టీని ఇరకాటంలో పెడుతోంది. దీనికి తోడు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఒంటెత్తు పోకడలు పోతున్నారంటూ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లాలో కూడా కింజారపు అచ్చం నాయుడు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు అంటూ గౌతు శ్యామసుందర శివాజీ, ఇతర నాయకులు అధినేత వద్ద వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంతకు ముందు రెండు మూడు సార్లు అచ్చం నాయుడు తో, జిల్లా నాయకులతో చంద్రబాబు నాయుడు మాట్లాడినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ చేజారుతుండడంతో అధిష్టానం తలపట్టుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  16 Feb 2019 9:42 PM GMT
Next Story