Telugu Global
NEWS

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం ఖరారు

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఈనెల 19న టీ కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంది. 19న ఉద‌యం 11 గంట‌ల 30 నిమిషాల‌కు కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా కొత్త మంత్రుల చేత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై చ‌ర్చించేందుకు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌లో క‌లిశారు.మాఘ శుద్ధ పౌర్ణ‌మి కావ‌డంతో ఈనెల 19ని కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తంగా నిర్ణ‌యించారు కేసీఆర్. ప్ర‌స్తుతం తెలంగాణ […]

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం ఖరారు
X

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఈనెల 19న టీ కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంది. 19న ఉద‌యం 11 గంట‌ల 30 నిమిషాల‌కు కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా కొత్త మంత్రుల చేత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై చ‌ర్చించేందుకు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌లో క‌లిశారు.మాఘ శుద్ధ పౌర్ణ‌మి కావ‌డంతో ఈనెల 19ని కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తంగా నిర్ణ‌యించారు కేసీఆర్.

ప్ర‌స్తుతం తెలంగాణ కేబినెట్‌లో కేసీఆర్‌తో పాటు హాంమంత్రి మ‌హ‌మూద్ అలీ మాత్ర‌మే ఉన్నారు. ఈసారి కేబినెట్‌లో కొత్త వారికి పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

First Published:  15 Feb 2019 3:31 AM GMT
Next Story