Telugu Global
NEWS

ఎమ్మెల్యే సండ్రకు షాక్... టీటీడీ నుంచి తొల‌గింపు

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌కు ఏపీ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. టీటీడీ బోర్డు నుంచి సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ను తొల‌గించింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 18న సండ్ర‌ను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ద‌వీ స్వీకారం చేయ‌లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం నెల రోజుల్లోగా బాధ్య‌త‌లు స్వీక‌రించాల్సి ఉంటుంద‌ని… కానీ నెల దాటినా ఆయ‌న ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేద‌ని అందుకే స‌భ్య‌త్వం ర‌ద్దు చేసిన‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. […]

ఎమ్మెల్యే సండ్రకు షాక్... టీటీడీ నుంచి తొల‌గింపు
X

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌కు ఏపీ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. టీటీడీ బోర్డు నుంచి సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ను తొల‌గించింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 18న సండ్ర‌ను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ద‌వీ స్వీకారం చేయ‌లేదు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం నెల రోజుల్లోగా బాధ్య‌త‌లు స్వీక‌రించాల్సి ఉంటుంద‌ని… కానీ నెల దాటినా ఆయ‌న ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేద‌ని అందుకే స‌భ్య‌త్వం ర‌ద్దు చేసిన‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు సండ్ర వెంక‌ట‌వీర‌య్య కూడా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు టీటీడీ స‌భ్యుడిగా అవకాశం ఇచ్చారు.

మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు గెల‌వ‌గా వారిలో సండ్ర వెంక‌ట‌వీర‌య్య ఒక‌రు. ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికవ‌గానే టీటీడీలో స‌భ్య‌త్వాన్ని మ‌రోసారి ఇచ్చారు. కానీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేద‌న్న కార‌ణంతో ఇప్పుడు ర‌ద్దు చేశారు. సండ్ర వెంక‌ట‌వీర‌య్య తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి టీడీపీ పెద్ద‌ల‌కు ట‌చ్‌లో లేరు. ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరుతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

First Published:  15 Feb 2019 3:08 AM GMT
Next Story