Telugu Global
National

రాహుల్ కు ముద్దుపెట్టిన మహిళ... వైరల్ అవుతోన్న వీడియో!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుకోని సంఘటన ఎదురైంది. గుజరాత్ లోని వల్సాద్ లో ఓ రాజకీయ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు అక్కడున్న కొందరు మహిళా కాంగ్రెస్ నేతలు స్టేజీ పైకి వెళ్లారు. అయితే అందులో ఓ మహిళా కాంగ్రెస్ నేత రాహుల్ ను చూసిన ఆనందంలో ఆయనకు ముద్దు పెట్టింది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇవాళ ప్రేమికుల రోజు కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. […]

రాహుల్ కు ముద్దుపెట్టిన మహిళ... వైరల్ అవుతోన్న వీడియో!
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుకోని సంఘటన ఎదురైంది. గుజరాత్ లోని వల్సాద్ లో ఓ రాజకీయ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు అక్కడున్న కొందరు మహిళా కాంగ్రెస్ నేతలు స్టేజీ పైకి వెళ్లారు.

అయితే అందులో ఓ మహిళా కాంగ్రెస్ నేత రాహుల్ ను చూసిన ఆనందంలో ఆయనకు ముద్దు పెట్టింది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇవాళ ప్రేమికుల రోజు కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే రాహుల్ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకోలేదు. చిరునవ్వులు చిందిస్తూ సింపుల్ గా తీసుకున్నారు. మిగతా మహిళలంతా రాహుల్ కు భారీ హారం వేస్తున్నప్పుడు ఆ మహిళ మాత్రం రాహుల్ ను చూస్తూ ముసిముసిగా నవ్వడం వీడియోలో కనిపించింది.

First Published:  14 Feb 2019 8:51 AM GMT
Next Story