Telugu Global
International

లాటరీ కొట్టాడు.... దోచేస్తారని భయపడి ఇలా చెక్ అందుకున్నాడు..!

జీతం కోసం ప్రతీ నెల వెయిట్ చేయడం ఎందుకు? ఒక్క సారి లాటరీ తగిలితేనా? నా లైఫే మారిపోతుంది అని చాలా మంది ఒక్క సారైనా అనుకుంటారు. లాటరీ తగిలితే జీవితాన్ని హాయిగా జీవించేయ్యొచ్చని కలలు కంటుంటారు. అలా కలలు కన్న ఒక వ్యక్తికి లాటరీ తగిలింది. ఏకంగా 158.4 యూఎస్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. జమైకాకు చెందిన ఒక వ్యక్తి (పేరు తెలియజేయడానికి అతడు ఇష్టపడలేదు.. క్యాంప్‌బెల్ అని […]

లాటరీ కొట్టాడు.... దోచేస్తారని భయపడి ఇలా చెక్ అందుకున్నాడు..!
X

జీతం కోసం ప్రతీ నెల వెయిట్ చేయడం ఎందుకు? ఒక్క సారి లాటరీ తగిలితేనా? నా లైఫే మారిపోతుంది అని చాలా మంది ఒక్క సారైనా అనుకుంటారు. లాటరీ తగిలితే జీవితాన్ని హాయిగా జీవించేయ్యొచ్చని కలలు కంటుంటారు. అలా కలలు కన్న ఒక వ్యక్తికి లాటరీ తగిలింది. ఏకంగా 158.4 యూఎస్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

జమైకాకు చెందిన ఒక వ్యక్తి (పేరు తెలియజేయడానికి అతడు ఇష్టపడలేదు.. క్యాంప్‌బెల్ అని అందరూ పిలుస్తున్నారు) గత వారంలో సుప్రీం వెంచర్స్ నిర్వహించే లాటరీని గెలుచుకున్నాడు. అయితే తాను లాటరీ గెలుచుకున్న విషయం తెలిస్తే దొంగలు తనను దోచేస్తారని భయపడ్డాడు. దీంతో లాటరీ చెక్ అందుకోవడానికి స్క్రీమ్ సినిమాలోని దెయ్యం మాస్క్ ధరించి వెళ్లాడు.

నిర్వాహకులు కూడా అతడి భయాన్ని అర్థం చేసుకొని అదే మాస్క్ లో అతడికి చెక్ అందజేశారు. చెక్ రిప్లికాపై తన పేరు కూడా రాయొద్దని అతడు కోరడంతో ఏ. క్యాంప్‌బెల్ అని రాశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మాస్క్‌తోనే మీడియాతో మాట్లాడాడు.

ఈ లాటరీ డబ్బులతో ఒక మంచి ఇల్లు నిర్మించుకుంటానన్నాడు. ఇకపై ఎవరినీ డబ్బులు అడగననీ, అప్పులు చేయనని చెప్పొకొచ్చాడు. ఈ డబ్బుతో మంచి జీవితం గడుపుతానని అన్నాడు.

లాటరీ గెలుచుకొని చెక్కులు తీసుకున్నప్పుడు ఇలా ముఖం దాచుకున్న వారిలో ఇతనే మొదటి వాడు కాదు. గతంలో ఒక వ్యక్తి ఎమోజీ ప్లకార్డును ముఖానికి ధరించి వచ్చాడు. అప్పుడు కూడా లాటరీ సంస్థ అతని బాధను అర్థం చేసుకొని అలాగే చెక్కును అందించింది.

First Published:  13 Feb 2019 3:15 AM GMT
Next Story