Telugu Global
Cinema & Entertainment

సౌందర్య రజనీకాంత్ పెళ్లి వేడుక

దాదాపు వారం రోజులుగా వార్తల్లో నలుగుతున్న సౌందర్య రజనీకాంత్ వివాహ వేడుక పూర్తయింది. ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో రజనీకాంత్ రెండో కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, నటుడు కమల్ హాసన్ తో పాటు పలువురు కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. సౌందర్య రజనీకాంత్ కు ఇది రెండో పెళ్లి. దాదాపు పదేళ్ల కిందటే ఆమెకు వ్యాపారవేత్త అశ్విన్ తో వివాహం అయింది. వాళ్లిద్దరికీ ఓ కుమారుడు […]

సౌందర్య రజనీకాంత్ పెళ్లి వేడుక
X

దాదాపు వారం రోజులుగా వార్తల్లో నలుగుతున్న సౌందర్య రజనీకాంత్ వివాహ వేడుక పూర్తయింది. ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో రజనీకాంత్ రెండో కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, నటుడు కమల్ హాసన్ తో పాటు పలువురు కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

సౌందర్య రజనీకాంత్ కు ఇది రెండో పెళ్లి. దాదాపు పదేళ్ల కిందటే ఆమెకు వ్యాపారవేత్త అశ్విన్ తో వివాహం అయింది. వాళ్లిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ వాళ్ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. దీంతో రెండేళ్ల కిందట అశ్విన్ తో విడాకులు తీసుకున్న సౌందర్య, ఇప్పుడు విశాగన్ ను వివాహమాడింది.

సౌందర్య, విశాగన్ కు రెండేళ్ల నుంచి పరిచయం. ఇద్దరిదీ సినిమా పరిశ్రమే కావడంతో ఈజీగా దగ్గరయ్యారు. ఒకర్నొకరు బాగా ఇష్టపడడంతో, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. రజనీకాంత్ దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాడు. స్వయంగా తనే వెళ్లి కొంతమంది ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందించాడు.

First Published:  11 Feb 2019 5:47 AM GMT
Next Story