Telugu Global
NEWS

తెలంగాణ‌లో పోటీకి జ‌న‌సేన సిద్ధం...

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీతో పాటు, తెలంగాణ‌లోనూ పోటీకి జ‌న‌సేన నిర్ణ‌యించుకుంది. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా న‌ల్ల‌గొండ‌, మెద‌క్, భువ‌న‌గిరి, వరంగ‌ల్ లోక్‌స‌భ స్థానాల‌కు పార్ల‌మెంట‌రీ క‌మిటీల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే సికింద్రాబాద్, ఖ‌మ్మం, మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ స్థానాల‌కు క‌మిటీల‌ను ప్ర‌క‌టించారు. మిగిలిన స్థానాల‌కు కూడా త్వ‌ర‌లోనే క‌మిటీల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌తో స్నేహం ఖ‌రారు చేసుకున్న జ‌న‌సేన…. తెలంగాణ‌లోనూ వారితో క‌లిసే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంది. మొన్న‌టి తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కూడా జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ఒక […]

తెలంగాణ‌లో పోటీకి జ‌న‌సేన సిద్ధం...
X

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీతో పాటు, తెలంగాణ‌లోనూ పోటీకి జ‌న‌సేన నిర్ణ‌యించుకుంది. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా న‌ల్ల‌గొండ‌, మెద‌క్, భువ‌న‌గిరి, వరంగ‌ల్ లోక్‌స‌భ స్థానాల‌కు పార్ల‌మెంట‌రీ క‌మిటీల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేశారు.

ఇప్ప‌టికే సికింద్రాబాద్, ఖ‌మ్మం, మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ స్థానాల‌కు క‌మిటీల‌ను ప్ర‌క‌టించారు. మిగిలిన స్థానాల‌కు కూడా త్వ‌ర‌లోనే
క‌మిటీల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌తో స్నేహం ఖ‌రారు చేసుకున్న జ‌న‌సేన…. తెలంగాణ‌లోనూ వారితో క‌లిసే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంది.

మొన్న‌టి తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కూడా జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ఒక ద‌శ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. అయితే ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకుని ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం పోటీ ఖాయమ‌ని జ‌న‌సేన చెబుతోంది.

First Published:  10 Feb 2019 9:04 PM GMT
Next Story