Telugu Global
International

పాపం అమెజాన్... దిక్కుతోచని స్థితిలో వ్యాపారం!

ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’…. ఇప్పుడు ఇండియాలో వ్యాపారం ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సరికొత్త ఆన్‌లైన్ మార్కెటింగ్ నిబంధనలతో వ్యాపార వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కేంద్రం ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చింది. ఈ నిబంధన ప్రకారం రిటైల్ కంపెనీలు, వస్తు ఉత్పత్తి సంస్థల్లో గనుక ఈ-కామర్స్ కంపెనీలకు వాటాలు ఉంటే ఆ వస్తువులను తమ సైట్ లో విక్రయించడం కుదరదు. దేశంలో […]

పాపం అమెజాన్... దిక్కుతోచని స్థితిలో వ్యాపారం!
X

ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’…. ఇప్పుడు ఇండియాలో వ్యాపారం ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సరికొత్త ఆన్‌లైన్ మార్కెటింగ్ నిబంధనలతో వ్యాపార వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల కేంద్రం ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చింది. ఈ నిబంధన ప్రకారం రిటైల్ కంపెనీలు, వస్తు ఉత్పత్తి సంస్థల్లో గనుక ఈ-కామర్స్ కంపెనీలకు వాటాలు ఉంటే ఆ వస్తువులను తమ సైట్ లో విక్రయించడం కుదరదు. దేశంలో దినదినాభివ‌ద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు పోటీ పడుతున్నాయి.

అయితే అమెజాన్‌కు పలు వ్యాపార సంస్థల్లో వాటాలు ఉన్నాయి. ఇటీవల ఫ్యూచర్ గ్రూప్‌సంస్థలో వాటాల కోసం 700 మిలియన్ డాలర్లు వెచ్చించాలని నిర్ణయానికి వచ్చింది. దాదాపు డీల్ ఖరారైన తర్వాత ఈ నిబంధనలు రావడంతో ప్రస్తుతానికి డీల్‌ను పక్కన పెట్టేశారు.

ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ లో కూడా పట్టు సాధించాలనే ఉద్దేశంతో దేశంలోని రిటైల్ సంస్థలైన ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్, స్పెన్సర్స్, ఫ్యూచర్ గ్రూప్ సంస్థల్లో వాటాలు కొనాలని భావించింది. ఆదిత్యా బిర్లా గ్రూప్‌కు చెందిన మోర్ సూపర్ మార్కెట్లో కూడా 49 శాతం వాటాను గత ఏడాది కొనుగోలు చేసింది. వీటి ద్వారా తమ సొంత ఉత్పత్తులను భారీగా అమ్మకాలు సాగించవచ్చని వ్యూహం రచించింది.

షాపర్స్ స్టాప్‌లో వాటాలను 5 శాతం పెంచుకోవాలని భావించినా కొత్త నిబంధనల మేరకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. కొత్త నిబంధనల ప్రకారం మరో వ్యూహం ఆలోచించి తిరిగి విక్రయాలు చేయాలని భావిస్తోంది. ఈ నిబంధన ఫలితంగానే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తమ సైట్లో వేలాది వస్తువులను తొలగించింది.

First Published:  11 Feb 2019 3:00 AM GMT
Next Story