Telugu Global
NEWS

నిరుద్యోగంలో జాతీయ స్థాయిని దాటిన ఏపీ

ఏపీలో నిరుద్యోగం తాండ‌విస్తోంది. జాతీయ స్థాయి స‌గ‌టును ఏపీ దాటేసింది. ”సెంట్ర‌ల్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ” స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు ఏపీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌ట్టు స‌ర్వేలో వెల్ల‌డైంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగుల సంఖ్య ఏపీలో జాతీయ స్థాయితో పోలిస్తే రెట్టింపు ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే చ‌దువురాని వాళ్ల విష‌యంలో మాత్రం జాతీయ స‌గ‌టు కంటే ఏపీ నిరుద్యోగ స‌గ‌టు త‌క్కువ‌గా ఉంది. ఏపీలో పెద్ద‌గా చ‌దువుకోని వారు […]

నిరుద్యోగంలో జాతీయ స్థాయిని దాటిన ఏపీ
X

ఏపీలో నిరుద్యోగం తాండ‌విస్తోంది. జాతీయ స్థాయి స‌గ‌టును ఏపీ దాటేసింది. ”సెంట్ర‌ల్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ” స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు ఏపీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌ట్టు స‌ర్వేలో వెల్ల‌డైంది.

గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగుల సంఖ్య ఏపీలో జాతీయ స్థాయితో పోలిస్తే రెట్టింపు ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే చ‌దువురాని వాళ్ల విష‌యంలో మాత్రం జాతీయ స‌గ‌టు కంటే ఏపీ నిరుద్యోగ స‌గ‌టు త‌క్కువ‌గా ఉంది. ఏపీలో పెద్ద‌గా చ‌దువుకోని వారు ఏదో ఒక పని చేసుకుని బ‌తుకుతున్నారు. బాగా చ‌దివిన వారి విష‌యంలో మాత్రం ఏపీలో
ప‌రిస్థితి జాతీయ స్థాయికి పూర్తి భిన్నంగా ఉంది.

ఏపీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారి నిరుద్యోగ తీవ్ర‌త జాతీయ స్థాయిలో 12 శాతంగా ఉంది. ఏపీలో మాత్రం అది ఏకంగా 25. 32 శాతంగా ఉంది. ఈ 25.32 శాతం మంది ఉన్న‌త విద్యావంతులు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారు. స‌ర్వేలో చాలా మంది ఉద్యోగంపై ఆశ‌లు వ‌దిలేసుకుని అన్వేష‌ణ కూడా మానేసిన‌ట్టు తేలింది.

ఆంధ్ర‌ప్రదేశ్‌లో చ‌దువుకున్న‌ వారి కంటే చ‌దువు రాని వారు, త‌క్కువగా చ‌దువుకున్న వారే ఏదో ఒక ప‌నిలో సెటిల్ అయిన‌ట్టు స‌ర్వే తేల్చింది. ఉన్నత చ‌దువులు చ‌దివిన వారి ప‌రిస్థితే ద‌య‌నీయంగా ఉంది.

First Published:  8 Feb 2019 11:39 PM GMT
Next Story