Telugu Global
Cinema & Entertainment

అదా శర్మ.... ఐటం సాంగ్....

‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ లాంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే కసితో నాచురల్ స్టార్ నాని ‘ జెర్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా లో నాని క్రికెటర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజా […]

అదా శర్మ.... ఐటం సాంగ్....
X

‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ లాంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే కసితో నాచురల్ స్టార్ నాని ‘ జెర్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా లో నాని క్రికెటర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ ఐటమ్ సాంగ్ లో కనిపించనుందట. నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదా శర్మ.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో కూడా కనిపించిన ఈమె ‘క్షణం’ సినిమా తరువాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అదా శర్మ ఒక ఐటెం సాంగ్ చేయబోతుందట.

ఇప్పటికే హీరోయిన్లు గా నటిస్తూనే కాజల్, తమన్నా, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు ఐటం నంబర్ లు గా మారిన సందర్భాలు చూశాం. ఇప్పుడు ఆదా శర్మ ఈ జాబితాలో చేరింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

First Published:  9 Feb 2019 8:00 AM GMT
Next Story