Telugu Global
National

ఇంట‌ర్వ్యూ ఫెయిల్ అయినా ఉద్యోగ‌మే... కొత్త ప్ర‌తిపాద‌న‌

సివిల్స్‌లో ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వెళ్ల‌డం అంటే గొప్ప విష‌య‌మే. కానీ చాలా మంది అక్క‌డి వ‌ర‌కు వెళ్లి ఇంట‌ర్వ్యూలో ఫెయిల్ అయి నిరాశ చెందుతుంటారు. అయితే ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వెళ్లి విఫ‌ల‌మైన వారి వేధ‌న కొద్దిగైనా త‌గ్గ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వానికి యూపీఎస్సీ కొత్త ప్ర‌తిపాద‌న పంపింది. సివిల్స్‌లో మెయిన్స్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వ‌చ్చి అక్క‌డ ఫెయిల్ అయిన వారి సేవ‌ల‌ను కూడా వాడుకోవాల‌ని సూచించింది. ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్ అయిన వారిని ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో నియ‌మించాల‌ని ప్ర‌తిపాదించింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం అంగీక‌రిస్తే […]

ఇంట‌ర్వ్యూ ఫెయిల్ అయినా ఉద్యోగ‌మే... కొత్త ప్ర‌తిపాద‌న‌
X

సివిల్స్‌లో ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వెళ్ల‌డం అంటే గొప్ప విష‌య‌మే. కానీ చాలా మంది అక్క‌డి వ‌ర‌కు వెళ్లి ఇంట‌ర్వ్యూలో ఫెయిల్ అయి నిరాశ చెందుతుంటారు. అయితే ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వెళ్లి విఫ‌ల‌మైన వారి వేధ‌న కొద్దిగైనా త‌గ్గ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వానికి యూపీఎస్సీ కొత్త ప్ర‌తిపాద‌న పంపింది. సివిల్స్‌లో మెయిన్స్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వ‌చ్చి అక్క‌డ ఫెయిల్ అయిన వారి సేవ‌ల‌ను కూడా వాడుకోవాల‌ని సూచించింది.

ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్ అయిన వారిని ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో నియ‌మించాల‌ని ప్ర‌తిపాదించింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం
అంగీక‌రిస్తే సివిల్స్ కోసం పోరాటం చేసే వారికి పెద్ద ఊర‌టే.

సివిల్స్‌లో ఇంట‌ర్వ్యూల వ‌ర‌కు వ‌చ్చిన వారిని ఏదో ఒక ఉద్యోగంలోకి తీసుకోవాల్సిందిగా కేంద్ర సిబ్బంది వ్య‌వ‌హారాల శాఖ‌కు తాము ప్ర‌తిపాద‌న పంపామ‌ని యూపీఎస్సీ చైర్మ‌న్ అర‌వింద్ వెల్ల‌డించారు. 2018 లెక్క‌లు ప‌రిశీలిస్తే ప్రిలిమ్స్‌ను దాటి మెయిన్స్ వ‌చ్చిన వారి సంఖ్య 10,500గా ఉంది. వారిలో ఇంట‌ర్వ్యూల‌కు రెండు వేల మంది హాజ‌ర‌య్యారు. వారిలో 782
మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. మిగిలిన 12వంద‌ల మందిని ఇంట‌ర్వ్యూలో ఫెయిల్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు.

సివిల్స్‌లో లక్ష‌ల మందితో పోటీని త‌ట్టుకుని ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వ‌చ్చారంటే వారిలో మంచి సామ‌ర్థ్యం ఉన్న‌ట్టే లెక్క‌. కాబ‌ట్టి వారిని ఏదో ఒక ఉద్యోగంలోకి తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ ఇత‌ర స‌ర్వీసుల‌కు మంచి జ‌రుగుతుంద‌ని యూపీఎస్పీ ప్ర‌తిపాదించింది.

అంతే కాకుండా ఇంట‌ర్వ్యూల వ‌ర‌కు వ‌చ్చిన అభ్య‌ర్థుల వివ‌రాల‌ను కూడా ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. వారు చూపిన ప్ర‌తిభ‌ను ప‌రిశీలించి ఏదైనా ప్రైవేట్ సంస్థ‌లు వారిని ఉద్యోగంలోకి తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ అభ్య‌ర్థి త‌న వివ‌రాల‌ను అలా ఆన్‌లైన్లో ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోతే అత‌డి వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్ట‌రు.

First Published:  7 Feb 2019 9:12 PM GMT
Next Story