Telugu Global
CRIME

భార్యను చంపి ముక్కలుగా నరికిన సినిమా డైరెక్టర్

భార్యపై అనుమానం పెంచుకున్న ఒక సినిమా డైరెక్టర్ ఆమెను చంపేయడమే కాక అత్యంత కిరాతకంగా ముక్కలుగా నరికి పలు చోట్ల వాటిని పడేశాడు. ఈ దారుణ సంఘటన చెన్నైలో జనవరి 19న జరుగగా…. నిందితుడైన భర్తను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన బాలకృష్ణన్(51), సంధ్య (37) భార్యభర్తలు. అతను సినిమా డైరెక్టర్‌గా ఉండగా ఆమె నటిగా చిన్న చిన్న వేషాలు వేస్తోంది. అయితే గత కొంత కాలంగా ఆమె […]

భార్యను చంపి ముక్కలుగా నరికిన సినిమా డైరెక్టర్
X

భార్యపై అనుమానం పెంచుకున్న ఒక సినిమా డైరెక్టర్ ఆమెను చంపేయడమే కాక అత్యంత కిరాతకంగా ముక్కలుగా నరికి పలు చోట్ల వాటిని పడేశాడు. ఈ దారుణ సంఘటన చెన్నైలో జనవరి 19న జరుగగా…. నిందితుడైన భర్తను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన బాలకృష్ణన్(51), సంధ్య (37) భార్యభర్తలు. అతను సినిమా డైరెక్టర్‌గా ఉండగా ఆమె నటిగా చిన్న చిన్న వేషాలు వేస్తోంది. అయితే గత కొంత కాలంగా ఆమె ఇంకొకరితో సంబంధం కలిగి ఉందనే అనుమానం బాలకృష్ణన్‌లో మొదలైంది. తరచూ వారి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో జనవరి 19న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలకృష్ణన్ ఆమెను చంపేశాడు.

బాలకృష్ణన్

ఆ తర్వాత శవాన్ని ఏం చేయాలో తెలియక.. మరుసటి రోజు ఆమె శరీరాన్ని పలు ముక్కలుగా నరికాడు. వాటిని కొన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి చెన్నైలోని పలు ప్రాంతాల్లోని చెత్త డబ్బాల్లో పడేశాడు. ఒక డంపింగ్ యార్డులో స్త్రీకి చెందిన కాళ్లు, మరి కొన్ని భాగాలు ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆమె సంధ్య అని గుర్తించడానికి రెండు టాటూలు కారణమయ్యాయి. శరీర భాగాలపై శివపార్వతులు, డ్రాగన్ బొమ్మలు పచ్చబొట్టుగా ఉండటంతో వాటి ఫొటోలను పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వారికి ఒక క్లూ లభించింది. వాటిని చూసిన సంధ్య తల్లి అది తన కూతురే అని గుర్తించింది. తన అల్లుడు గత వారం కాల్ చేసి కూతురు తన దగ్గరకు (తూత్తుకుడి) వచ్చిందని చెప్పాడని ఆమె పోలీసులకు చెప్పింది.

సంధ్య

భర్త బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అతను ఇచ్చిన ఆధారాల పరంగా మిగిలిన శరీరభాగాలు ఎక్కడ ఉన్నాయో వెతకడం ప్రారంభించారు. మొండెం, మరి కొన్ని భాగాలు దొరికినా ఇంకా తల మాత్రం లభ్యం కాలేదు.

First Published:  7 Feb 2019 12:00 AM GMT
Next Story