Telugu Global
NEWS

రేవంత్ రెడ్డి పదవికి ముప్పు.... తప్పించే యోచనలో కాంగ్రెస్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా ప్రచారం పొంది.. కేసీఆర్‌ను ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకుడు అతడే అంటూ పొగడబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఏకంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పొందారు. ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినా స్వయంగా తానే ఓడిపోయాడు. దీంతో ఆయన సైలెంట్ అయిపోయాడు. పంచాయితీ ఎన్నికల్లో పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నించి కొంత మేర సక్సెస్ అయ్యారు. అయితే రెండు రోజుల క్రితం […]

రేవంత్ రెడ్డి పదవికి ముప్పు.... తప్పించే యోచనలో కాంగ్రెస్!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా ప్రచారం పొంది.. కేసీఆర్‌ను ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకుడు అతడే అంటూ పొగడబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఏకంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పొందారు. ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినా స్వయంగా తానే ఓడిపోయాడు. దీంతో ఆయన సైలెంట్ అయిపోయాడు.

పంచాయితీ ఎన్నికల్లో పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నించి కొంత మేర సక్సెస్ అయ్యారు. అయితే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన సందర్భంగా రేవంత్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే అని చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను కూడా సీనియర్ల ముందే రాహుల్‌కు వివరించారట.

ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పుడు నాలుగురైదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇంత మంది ఆ పదవిలో ఉండటం అనవసరమని సీనియర్లు రాహుల్‌కు చెప్పారట. ఇలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను తొలగించి టీపీసీసీని ప్రక్షాళన చేయమని రాహుల్ గాంధీకి పలువురు సలహా ఇచ్చారట.

దీంతో సీనియర్ల సలహా మేరకు టీపీసీసీని ప్రక్షాళన చేయడమే సరైన మార్గమని రాహుల్ కూడా భావిస్తున్నారట. అదే జరిగితే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వంటి చురుకైన నాయకుడిని పదవి నుంచి తప్పించడం కంటే మరో కీలక పదవి ఇస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి రాహుల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో త్వరలోనే తెలుస్తుంది.

First Published:  7 Feb 2019 1:33 AM GMT
Next Story