Telugu Global
International

తల్లిని రక్షించుకోవడానికి 320 కిలోమీటర్లు ప్రయాణించి అంబులెన్సు కంటే ముందే చేరుకున్నాడు..!

ఇంట్లో జారి పడిపోయిన తల్లి తీవ్ర గాయాలపాలైంది. మరోవైపు అంబులెన్సుకు కాల్ చేసినా రావట్లేదు. ఇక తనే బయలుదేరి 320 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాతే అంబులెన్సు రావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే… ఇంగ్లాండ్‌కు చెందిన మార్కె క్లెమెంట్ లండన్‌లో నివసిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు డేవన్ నగరంలో ఉంటారు. ఒక రోజు తన 77 ఏళ్ల తల్లి మార్గరెట్ ఇంట్లో జారి పడిపోయి నడుముకు తీవ్ర గాయమైంది. అసలు లేవలేని స్థితిలో ఉంది. […]

తల్లిని రక్షించుకోవడానికి 320 కిలోమీటర్లు ప్రయాణించి అంబులెన్సు కంటే ముందే చేరుకున్నాడు..!
X

ఇంట్లో జారి పడిపోయిన తల్లి తీవ్ర గాయాలపాలైంది. మరోవైపు అంబులెన్సుకు కాల్ చేసినా రావట్లేదు. ఇక తనే బయలుదేరి 320 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాతే అంబులెన్సు రావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే… ఇంగ్లాండ్‌కు చెందిన మార్కె క్లెమెంట్ లండన్‌లో నివసిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు డేవన్ నగరంలో ఉంటారు. ఒక రోజు తన 77 ఏళ్ల తల్లి మార్గరెట్ ఇంట్లో జారి పడిపోయి నడుముకు తీవ్ర గాయమైంది. అసలు లేవలేని స్థితిలో ఉంది. అతని తండ్రి కూడా వయసైపోవడంతో తాను ఏం చేయలేని పరిస్థితి. దీంతో వాళ్లు అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వెంటనే తమ కుమారుడు క్లెమెంట్‌కు కాల్ చేశారు.

సమాచారం తెలుసుకున్న క్లెమెంట్ లండన్‌ నుంచి హుటాహుటిన బయలుదేరాడు. మెట్రో రైలు, ట్రెయిన్, బస్సులు మారుతూ 320 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో చేరుకున్నాడు. ఇంటికి వస్తూనే తన తల్లి దీన స్థితిని చూసి చలించిపోయాడు. ఆయన ఇంటికి వచ్చిన 10 నిమిషాలకు గాని అంబులెన్స్ రాలేదు.

తన ఇంటి నుంచి అంబులెన్సు కేవలం పది నిమిషాల దూరంలోనే ఉంటుంది. తాను అంత దూరం ప్రయాణించి వచ్చిన తర్వాతే అంబులెన్స్ వచ్చింది. ఇదేనా వారి సేవా గుణం అంటూ మండిపడ్డాడు. తాము ఆ రోజు చాలా బిజీగా ఉన్నామని.. ప్రాణాలకు ముప్పులేదని భావించిన వారి దగ్గరకు లేటుగా వెళ్లామన్నారు. అయితే తొలి కాల్ చేసిన 9 గంటల తర్వాత అంబులెన్సు అక్కడకు చేరుకోవడం గమనార్హం.

ప్రస్తుతం మార్గరెట్ తుంటికి ఆపరేషన్ చేశారు. ఆమె కోలుకుంటోందని కుమారుడు క్లెమెంట్ చెప్పాడు.

First Published:  7 Feb 2019 12:39 AM GMT
Next Story