Telugu Global
NEWS

రోజ్ డే స్పెషల్ : రోడ్లపై రోజా పూలు పంచుతున్న పోలీసులు

ఫిబ్రవరి నెల వచ్చిందంటే ప్రేమికులకు పండగే. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డేను ఎలా జరిపుకోవాలని ప్రేమికులు ప్రణాళికలు రచిస్తుంటే…. ఇంకా ప్రపోజ్ చేయని ప్రేమికులు ఆ రోజు ఎలాగైనా తమ ప్రేమను వెల్లడించాలని ఆరాటపడుతుంటారు. ఇక ప్రేమికుల రోజుకు వారం ముందు నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. ప్రతీ రోజు ఒక్కో పేరుతో తమ సహచరులకు ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఇవాళ రోజ్‌డేతో ప్రారంభించి వరుసగా ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, […]

రోజ్ డే స్పెషల్ : రోడ్లపై రోజా పూలు పంచుతున్న పోలీసులు
X

ఫిబ్రవరి నెల వచ్చిందంటే ప్రేమికులకు పండగే. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డేను ఎలా జరిపుకోవాలని ప్రేమికులు ప్రణాళికలు రచిస్తుంటే…. ఇంకా ప్రపోజ్ చేయని ప్రేమికులు ఆ రోజు ఎలాగైనా తమ ప్రేమను వెల్లడించాలని ఆరాటపడుతుంటారు.

ఇక ప్రేమికుల రోజుకు వారం ముందు నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. ప్రతీ రోజు ఒక్కో పేరుతో తమ సహచరులకు ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఇవాళ రోజ్‌డేతో ప్రారంభించి వరుసగా ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అంటూ కొనసాగుతాయి.

ఈ ప్రేమికుల రోజులు మీరేనా మేమూ జరుపుతాం అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుకు వచ్చారు. అసలు ఖాకీలంటేనే కరుడుగట్టిన మనసు ఉంటుందని అందరూ అనుకుంటుంటారు. పార్కుల్లో ప్రేమికులు కనిపిస్తే బెదిరించే పోలీసులు కూడా ఉంటారు. అలాంటిది వీరు లవర్స్ డే చేయడం ఏంటా అని అనుకుంటున్నారా..?

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించడానికి ఈ రోజ్ డేను ఉపయోగించుకున్నారు. గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ హెల్మెట్లు ధరించకుండా, సీటు బెల్టులు పెట్టుకోకుండా కనపడిన వాహనదారులకు రోజా పూలు ఇచ్చి రూల్స్‌పై అవగాహన కల్పించారు. రోజ్ డే ను ఇలా వినూత్నంగా జరపడంతో రోడ్లపై రోజా పూలు పట్టుకున్న పోలీసులను చూసి ఒకింత ఆశ్చర్యంతో చూశారు జనం.

Hyderabad Traffic Police wishing a happy #RoseDay Tr. Police Gopalpuram counselling the commuters by giving the roses.

Posted by Hyderabad Traffic Police on Thursday, 7 February 2019

First Published:  7 Feb 2019 5:26 AM GMT
Next Story