Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ కి నాన్నగా బోమన్ ఇరానీ

త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా “అత్తారింటికి దారేది”. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తాతగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత బోమన్ ఇరానీ “అజ్ఞ్యాతవాసి” సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రిగా నటించాడు. ఇక ఇప్పుడు మరో సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ బోమన్ ఇరానీ ని తన సినిమాలోకి మరోసారి […]

అల్లు అర్జున్ కి నాన్నగా బోమన్ ఇరానీ
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా “అత్తారింటికి దారేది”. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తాతగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ నటన అందరినీ ఆకట్టుకుంది.

ఆ తరువాత బోమన్ ఇరానీ “అజ్ఞ్యాతవాసి” సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రిగా నటించాడు. ఇక ఇప్పుడు మరో సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ బోమన్ ఇరానీ ని తన సినిమాలోకి మరోసారి తీసుకోబోతున్నాడు.

అవును ఈ సారి బోమన్ ఇరానీ అల్లు అర్జున్ కి తండ్రిగా నటించబోతున్నాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొత్తం తండ్రి కొడుకుల నేపధ్యంలో నడుస్తుందట.

అందుకే తండ్రి పాత్ర కోసం బోమన్ ఇరానీ అయితేనే బాగుంటుందని భావించి ఆయన్ని తీసుకున్నాడట త్రివిక్రమ్. గీత ఆర్ట్స్, హారిక హాసిని కలయికలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.

First Published:  7 Feb 2019 9:16 AM GMT
Next Story