Telugu Global
Cinema & Entertainment

నాని కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.  ఏప్రిల్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో నాని…. అర్జున్ అనే క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత నాని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడానికి రెడి అయ్యాడు నాని. […]

నాని కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో నాని…. అర్జున్ అనే క్రికెటర్ గా నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత నాని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడానికి రెడి అయ్యాడు నాని. ఇప్పటికే ఈ సినిమా కోసం హీరోయిన్స్ గా కీర్తి సురేష్, మెగా ఆకాష్, ప్రియ వారియర్ ని అనుకుంటున్నారు మూవీ యూనిట్.

ఇక సమాచారం ప్రకారం క్యూరియన్ కేస్ అఫ్ బెంజిమెన్ బటన్ అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడట విక్రమ్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తుంది. ఇది నాని కెరీర్లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ హక్కులను దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం బడ్జెట్ కి మైత్రి మూవీ మేకర్స్ వారు ఓకే చెప్పారని తెలుస్తుంది. షూటింగ్ మొదలు కాక ముందే సినిమాకు సంబందించిన ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయని టాక్. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

First Published:  6 Feb 2019 12:32 AM GMT
Next Story