Telugu Global
NEWS

కేసీఆర్ మౌనం వెనుక ఏముంది?

కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. తెలంగాణ ముఖ్యమంత్రి. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించిన నాయకుడు. తెలంగాణ శాసనసభకు రెండోసారి జరిగిన ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచిన నాయకుడు. వ్యూహ రచనలో, దానిని అమలు చేయడంలో కేసీఆర్ కు ఎంతో పేరుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల […]

కేసీఆర్ మౌనం వెనుక ఏముంది?
X

కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. తెలంగాణ ముఖ్యమంత్రి. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించిన నాయకుడు. తెలంగాణ శాసనసభకు రెండోసారి జరిగిన ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచిన నాయకుడు. వ్యూహ రచనలో, దానిని అమలు చేయడంలో కేసీఆర్ కు ఎంతో పేరుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

ప్పటికే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులతోను, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల తోనూ సమావేశమయ్యారు. కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే వస్తోందని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఎవరెన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగానే పరుగులు పెడుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో తాజాగా జరుగుతున్న సంఘటనలు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని దేశంలోని ఇతర రాజకీయ పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ డిజిపిని అరెస్టు చేసేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. దీనికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు మాత్రం ఈ అంశంపై మౌనంగానే ఉన్నారు.

ఈ మౌనం వెనుక కారణం ఏమిటని రాజకీయ విశ్లేషకులు చర్చల మీద చర్చలు చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడకపోవడం వెనుక ఆయన భారతీయ జనతాపార్టీ మనిషి అని రుజువు అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం తన మౌనాన్ని వీడలేదు. కేంద్రం పెత్తనాన్ని పదే పదే విమర్శించే కేసీఆర్ చేతల్లో కి వచ్చేసరికి మౌనం దాల్చడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

కేసీఆర్ ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్ భారతీయ జనతా పార్టీకి అనుకూలమేనని వస్తున్న విమర్శలకు కేసీఆర్ మౌనం నిజమేనని అనుమానాలను రేకెత్తిస్తోంది. నేడు పశ్చిమబెంగాల్ కు జరిగిన అవమానం, ఆంక్షలు రేపు మిగతా రాష్ట్రాలకు కూడా జరుగుతాయని దేశంలోని అన్ని పార్టీలు విమర్శిస్తుంటే కేసీఆర్ మాత్రం మౌనముద్ర దాల్చడం ఆయన వ్యూహంలో భాగమేనని కొందరు అంటున్నారు.

అయితే ఇలా మౌనంగా ఉండటం వల్ల తాత్కాలిక ప్రయోజనం ఉంటుందేమో కాని, భవిష్యత్తులో మాత్రం తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ వస్తే తెలంగాణను కూడా ఆయన వదిలిపెట్టారని అంటున్నారు. బహుశా ఇలా జరగకుండా ఉండడం కోసమే తన భవిష్యత్ అవసరాల కోసం కేసీఆర్ మౌనం వహించారేమోనని అంటున్నారు. మౌనం అర్థాంగీకారమే అయినా అది ఎవరి వైపు అర్ధాంగీకారమో తెలియక అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజలు అయోమయంలో ఉన్నారు.

First Published:  5 Feb 2019 6:43 AM GMT
Next Story