Telugu Global
NEWS

పోలీసుల వలయంలో పెనుకొండ....

అనంతపురం జిల్లా పెనుకొండలో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ కీలక నేతలను హౌజ్‌ అరెస్ట్ చేశారు. కియా కార్ల ఫ్యాక్టరీని జిల్లాలో ఏర్పాటు చేసినా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదు. తమిళనాడుకు చెందిన వారికే అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తారన్న హామీతో భూములు ఇచ్చిన వారికి కూడా మొండిచేయి మిగిలింది. ఈనేపథ్యంలో కియాలో తెలుగువారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ కియా ఫ్యాక్టరీ ఎదుట నేడు మహాధర్నాకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ […]

పోలీసుల వలయంలో పెనుకొండ....
X

అనంతపురం జిల్లా పెనుకొండలో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ కీలక నేతలను హౌజ్‌ అరెస్ట్ చేశారు. కియా కార్ల ఫ్యాక్టరీని జిల్లాలో ఏర్పాటు చేసినా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదు.

తమిళనాడుకు చెందిన వారికే అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తారన్న హామీతో భూములు ఇచ్చిన వారికి కూడా మొండిచేయి మిగిలింది. ఈనేపథ్యంలో కియాలో తెలుగువారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ కియా ఫ్యాక్టరీ ఎదుట నేడు మహాధర్నాకు వైసీపీ పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో పోలీసులు కియా ఫ్యాక్టరీ వద్ద, పెనుగొండలోనూ భారీగా మోహరించారు. వైసీపీ నేత శంకర్‌ నారాయణను పెనుకొండలో హౌజ్ అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని అనంతపురంలోనే గృహనిర్బంధం చేశారు. రాప్తాడు వైసీపీ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కూడా హౌజ్‌ అరెస్ట్ అయ్యారు.

First Published:  3 Feb 2019 11:20 PM GMT
Next Story