Telugu Global
NEWS

పరిటాల సునీతకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

చంద్రబాబు ఒక కాలం చెల్లిన రాజకీయ నేత అని అభివర్ణించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పోస్టు డేటెడ్‌ చెక్కులతో మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను చంద్రబాబు మాఫీ చేసి ఉంటే ఇప్పుడు 22వేల కోట్లకు అప్పు చేరి ఉండేది కాదన్నారు. తోపుదుర్తి గ్రామంలో మహిళలపై పోలీసులను ఉసిగొల్పి పరిటాల సునీత ముందుకెళ్లడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు రోజా. మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళలను మోసం […]

పరిటాల సునీతకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
X

చంద్రబాబు ఒక కాలం చెల్లిన రాజకీయ నేత అని అభివర్ణించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పోస్టు డేటెడ్‌ చెక్కులతో మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను చంద్రబాబు మాఫీ చేసి ఉంటే ఇప్పుడు 22వేల కోట్లకు అప్పు చేరి ఉండేది కాదన్నారు.

తోపుదుర్తి గ్రామంలో మహిళలపై పోలీసులను ఉసిగొల్పి పరిటాల సునీత ముందుకెళ్లడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు రోజా. మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళలను మోసం చేసేందుకు సిగ్గు లేదా అని నిలదీశారు. 22 వేల కోట్లకు చేరిన డ్యాక్రా రుణాలను మాఫీ చేయించే దమ్ము పరిటాల సునీతకు ఉందా అని సవాల్ చేశారు.

పోలీసులు లేకుండా పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహించే ధైర్యం లేని పరిటాల సునీత కూడా జగన్‌ గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేసినందుకు చంద్రబాబుకు మహిళలు ఓటేయాలా?…. కాల్ మనీ సెక్స్‌ రాకెట్‌ నిర్వహించినందుకు ఓటేయాలా? లేక వీధికో వైన్ షాపు తెచ్చినందుకు ఓటేయాలా? అని రోజా ప్రశ్నించారు.

First Published:  3 Feb 2019 11:49 PM GMT
Next Story