Telugu Global
NEWS

" నా లైంగిక సంబంధాలు నా ఇష్టం.... "

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసు దర్యాప్తుపై పలు అనుమానాలను ఆయన కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కేసులో కీలక వ్యక్తులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం రాజేశ్‌ పైకే కేసు మొత్తం తోసేసి మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం పోలీసులపై భారీగా ఒత్తిళ్తు వస్తున్నట్టు చెబుతున్నారు. కీలక నిందితులను తప్పించేందుకు భారీ మొత్తానికి డీల్ కుదిరినట్టు ఆరోపిస్తున్నారు. 48 గంటలుగా శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె పొంతనలేని సమాధానాలు […]

 నా లైంగిక సంబంధాలు నా ఇష్టం....
X

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసు దర్యాప్తుపై పలు అనుమానాలను ఆయన కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కేసులో కీలక వ్యక్తులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

కేవలం రాజేశ్‌ పైకే కేసు మొత్తం తోసేసి మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకోసం పోలీసులపై భారీగా ఒత్తిళ్తు వస్తున్నట్టు చెబుతున్నారు. కీలక నిందితులను తప్పించేందుకు భారీ మొత్తానికి డీల్ కుదిరినట్టు ఆరోపిస్తున్నారు. 48 గంటలుగా శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.

జయరాంతో తనకు లైంగిక సంబంధం ఉన్న మాట వాస్తవమేనని… అయితే లైంగిక సంబంధాలు తన పర్సనల్‌ వ్యవహారమని ఆమె వాదిస్తున్నారు. హత్యలో శిఖా చౌదరితో పాటు మరికొందరు పెద్దల హస్తం కూడా ఉందని జయరాం కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్సీతోనూ జయరాంకు ఇటీవల ఒక ల్యాండ్ విషయంతో గొడవ జరిగినట్టు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కేసును ఏపీ పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే… తాము తెలంగాణ డీజీపీని ఆశ్రయిస్తామని జయరాం కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లోనే జయరాంను హత్య చేసి ఇక్కడికి తెచ్చారని పోలీసులు కూడా చెబుతున్న నేపథ్యంలో కేసును విచారించే అధికారం తెలంగాణ పోలీసులకు కూడా ఉంటుందని జయరాం కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో న్యాయవాదుల ద్వారా తెలంగాణ డీజీపీని కలిసేందుకు జయరాం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

First Published:  3 Feb 2019 11:40 PM GMT
Next Story