Telugu Global
Cinema & Entertainment

నాగ శౌర్యతో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్

పవన్ కళ్యాణ్ హీరోగా “కాటమరాయుడు” “సర్దార్ గబ్బర్ సింగ్” అనే సినిమాలని ప్రొడ్యూస్ చేసాడు శరత్ మరార్. అప్పట్లో నార్త్ స్టార్ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ ని స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించిన శరత్ మరార్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. అయితే ఈ సినిమాల వల్ల నష్టపోయిన శరత్ మరార్ కొన్ని రోజుల పాటు సినిమాలను నిర్మించడం ఆపేసి…. డబ్బింగ్ సినిమాలని తెలుగు లో రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ […]

నాగ శౌర్యతో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్
X

పవన్ కళ్యాణ్ హీరోగా “కాటమరాయుడు” “సర్దార్ గబ్బర్ సింగ్” అనే సినిమాలని ప్రొడ్యూస్ చేసాడు శరత్ మరార్. అప్పట్లో నార్త్ స్టార్ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ ని స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించిన శరత్ మరార్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు.

అయితే ఈ సినిమాల వల్ల నష్టపోయిన శరత్ మరార్ కొన్ని రోజుల పాటు సినిమాలను నిర్మించడం ఆపేసి…. డబ్బింగ్ సినిమాలని తెలుగు లో రిలీజ్ చేస్తూ వచ్చాడు.

ఇక ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ చాలా కాలం తరువాత ఒక సినిమాని నిర్మిస్తున్నాడు. అది కూడా స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ స్థాపించిన సుకుమార్ రైటింగ్స్ తో కలిసి.

అవును వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్ గా, నాగ శౌర్య హీరోగా, ఒక సినిమా స్టార్ట్ కానుంది. సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ ఈ సినిమాకి దర్శకుడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

First Published:  3 Feb 2019 6:13 AM GMT
Next Story